చైనా ఓపెన్ లో సైనాకు షాక్... దూసుకుపోతున్న సింధు

By Arun Kumar PFirst Published Sep 18, 2019, 5:09 PM IST
Highlights

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధు మరో సీరిస్ పై  కన్నేసింది. చైనా ఓపెన్ సూపర్ సీరిస్ 1000 లో స్థానిక క్రీడాకారిణిని  ఓడించిన సింధు ప్రీక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 

''చైనా ఓపెన్ సూపర్ సీరిస్ 1000''  టోర్నీలో భారత బ్యాడ్మింటన్ బృందానికి ఇవాళ(బుధవారం) మిశ్రమ పలితాలు లభించాయి. మహిళల విభాగంలో హైదరాబాదీ షట్లర్ పివి సింధు మరోసారి సత్తాచాటగా సైనా నెహ్వాల్ మాత్రం మరోసారి నిరాశపర్చింది. ఇక పురుషుల విభాగంలో సాయి ప్రణీత్ కూడా సత్తా చాటి అద్భుత విజయాన్ని అందుకున్నాడు. 

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ విజయం తర్వాత భారీ అంచనాలతో సింధు చైనా  ఓపెన్ టోర్నీని ప్రారంభించింది. అయితే ఇందులోనూ ఆమె జోరు  కొనసాగింది.ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడిన ఆమె గత ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, స్థానిక క్రీడాకారిణి లీ జురున్ ను అతి సునాయాసంగా ఓడించింది. ఆరంంభం నుండి దూకుడుగా ఆడుతూ వరుస సెట్లలో 21-18, 21-12 పాయింట్లను సాధించిన సింధు కేవలం 34 నిమిషాల్లోనే మ్యాచ్ ను ముగించింది.  ఈ విజయం ద్వారా సింధు ఫ్రీక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. 

ఇక మరో హైదరబాదీ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఈ టోర్పీలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.  8వ సీడ్ క్రీడాకారిణి సైనా జపాన్ కు చెందిన 19వ సీడ్ బుసానన్ చేతిలో ఓడిపోయింది. 10-21,  17-21 వరుస సెట్లను కోల్పోయి సైనా ఈ టోర్నీ నుండి వైదొలగింది. 

పురుషుల  విభాగంలో సాయి ప్రణీత్ దూసుకుపోతున్నాడు. థాయ్ లాండ్ కు చెందిన  అవిహింగ్ సనన్ తో  హోరాహోరీగా  పోరాడిన అతడు 21-19, 21-23, 21-14 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. దీంతో తర్వాతి రౌండ్ కు అర్హత సాధించాడు. 

click me!