ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్న ఎంఎస్ ధోనీ... హింట్ ఇచ్చేసిన చెన్నై సూపర్ కింగ్స్...

By Chinthakindhi RamuFirst Published Jun 14, 2023, 12:35 PM IST
Highlights

ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ.. ‘ఓ కెప్టెన్, మై కెప్టెన్’ అంటూ ధోనీ స్పెషల్ వీడియో షేర్ చేసిన సీఎస్‌కే.. 

మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి నాలుగు సీజన్లుగా చర్చ జరుగుతూనే ఉంది. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌కి నాలుగో టైటిల్ అందించాడు..

2022 ఐపీఎల్ ఆరంభంలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా, రవీంద్ర జడేజా కెప్టెన్‌గా ఫెయిల్ కావడంతో సీజన్ మధ్యలో మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. 2023 ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఐదో టైటిల్ అందుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, సీజన్ మొత్తంగా మోకాలి గాయంతో బాధపడ్డాడు..

Latest Videos

2023 సీజన్ తర్వాత మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, త్వరలోనే ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటన ఇవ్వబోతున్నాడా? అవుననే అంటున్నారు మాహీ ఫ్యాన్స్. దీనికి చెన్నై సూపర్ కింగ్స్ పోస్ట్ చేసిన వీడియోనే సాక్ష్యమని చెబుతున్నారు..

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమితో భారత అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్న సమయంలో ‘ఎల్లో లవ్’ అంటూ ఆస్ట్రేలియాకి విషెస్ చెబుతూ వివాదాస్పద ట్వీట్ వేసింది చెన్నై సూపర్ కింగ్స్...

Oh Captain, My Captain! 🥹 🦁💛 pic.twitter.com/whJeUjWUVd

— Chennai Super Kings (@ChennaiIPL)

దేశం పరువు పోతున్నా సంబంధం లేకుండా కేవలం ఎల్లో కలర్ జెర్సీ వేసుకున్నందుకు ‘ఎల్లో లవ్’ అంటూ సంతోషపడుతున్నట్టు చెన్నై సూపర్ కింగ్స్ వేసిన ట్వీట్ పెను దుమారమే రేపింది. తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ గురించి ‘ఓ కెప్టెన్, మై కెప్టెన్!’ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది సీఎస్‌కే...

సడెన్‌గా ధోనీని గుర్తుచేసుకుంటూ కెప్టెన్ అంటూ వీడియో షేర్ చేయడంతో త్వరలోనే మాహీ నుంచి ఐపీఎల్ రిటైర్మెంట్ రాబోతుందని అనుమానిస్తున్నారు ఆయన అభిమానులు. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన తర్వాత వచ్చే సీజన్‌లో ఆడేదీ, లేనిదీ క్లారిటీ ఇవ్వలేదు మహేంద్ర సింగ్ ధోనీ...

‘వచ్చే సీజన్‌లో ఆడాలనే అనుకుంటున్నా. అయితే నా శరీరం సహకరిస్తుందో లేదో తెలీదు. అయితే దానికి ఇంకా నాకు 7-8 నెలల సమయం ఉంది. తీరిగ్గా నిర్ణయం తీసుకుంటా...’ అంటూ వ్యాఖ్యానించాడు మహేంద్ర సింగ్ ధోనీ...
 

2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఐపీఎల్ 2020 సీజన్ కోసం యూఏఈ వెళ్లిన ధోనీ, ఆగస్టు 15న సడెన్‌గా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించి షాక్ ఇచ్చాడు. ఐపీఎల్ రిటైర్మెంట్ విషయంలో కూడా ధోనీ ఇలాగే నడుచుకోవచ్చని అనుకుంటున్నారు ఫ్యాన్స్...

మిగిలిన క్రికెటర్ల మాదిరి చెప్పి మరీ ఆఖరి మ్యాచ్ ఆడడం, లాస్ట్ మ్యాచ్‌లో గార్డ్ ఆఫ్ హోనర్ తీసుకుంటూ ఎమోషనల్ అవ్వడం వంటి మహేంద్ర సింగ్ ధోనీకి పెద్దగా ఇష్టం ఉండవని, అందుకే సైలెంట్‌గా సోషల్ మీడియా ద్వారా రిటైర్మెంట్ ప్రకటన ఇస్తున్నాడని అంటున్నారు మాహీ ఫ్యాన్స్.. 

click me!