అప్పుడు నా దగ్గర ఇండియా వీసా లేదు.. భారత అధికారులు నన్ను, నా భార్యను.. : వసీం అక్రమ్ ఎమోషనల్ కామెంట్స్

By Srinivas M  |  First Published Feb 27, 2023, 11:41 AM IST

పాకిస్తాన్  క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్   తన  ఆటో బయోగ్రఫీ ‘సుల్తాన్ : ఎ మెమోయిర్’ పై చర్చ సందర్భంగా ఎమోషనల్ అయ్యాడు. తన మొదటి భార్య హ్యూమాను తలుచుకుంటూ...


పాకిస్తాన్  దిగ్గజ పేసర్ వసీం అక్రమ్  చరిత్రలో తనకంటూ  ఓ పేజీని లిఖించుకున్న బౌలర్. అభిమానులు ‘స్వింగ్ ఆఫ్ సుల్తాన్’గా పిలుచుకునే  అక్రమ్  వ్యక్తిగత జీవితంలో జరిగిన ఘటనలు,  క్రికెట్ లో తాను చూసిన పరిస్థితులపై ఆయన తీసుకొస్తున్న ఆటో బయోగ్రఫీ త్వరలోనే బయటకు రానున్నది.  ‘సుల్తాన్ : ఎ మెమోయిర్’ అనే పేరుతో రానున్న ఈ పుస్తకానికి సంబంధించి జరిగిన చర్చలో అక్రమ్  తన  మొదటి భార్య హ్యుమా అక్రమ్ మరణానికి సంబంధించిన   ఓ విషయాన్ని  గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆమె చనిపోయిన సందర్భంలో తమ వద్ద ఇండియా వీసా లేదని, కానీ  చెన్నై ఎయిర్‌పోర్ట్ అధికారులు మాత్రం తనకు సాయం అందించారని చెప్పాడు. 

స్పోర్ట్స్‌స్టార్  మ్యాగజైన్ తో అక్రమ్ మాట్లాడుతూ.. ‘నా భార్యకు వైద్యం కోసం మేం  ప్రత్యేకమైన ఎయిర్ అంబులెన్స్ లో లాహోర్ నుంచి  సింగపూర్ కు వెళ్తున్నాం.  మార్గ మధ్యంలో  అది  చెన్నైలో ఇంధనం నింపుకునేందుకు ఆగింది... 

Latest Videos

విమానం ఆగగానే నా భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు.   నేను ఏడుస్తూనే ఉన్నా.  కానీ చెన్నై ఎయిర్‌పోర్ట్ అధికారులు, అక్కడ ఉన్న ప్రజలు నన్ను గుర్తుపట్టి  ఓదార్చారు.  వాస్తవానికి మా దగ్గర అప్పుడు ఇండియా వీసా లేదు.  పాకిస్తాన్ పాస్ పోర్ట్ లు మాత్రమే ఉన్నాయి. నా భార్య ఉన్నఫళంగా అలా అయిపోయేసరికి నాకు ఏం చేయాలో తోచలేదు. కానీ ఎయిర్‌పోర్టు లో భద్రతా  అధికారులు, ఇమిగ్రేషన్ అధికారులు నా దగ్గరికి వచ్చి   వీసా గురించి  బాధపడొద్దని చెప్పారు. వీసా గురించి తాము చూసుకుంటామని, నా భార్యను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.  ఆ ఘటనను నేను ఎప్పటికీ మరిచిపోలేను..’అని  చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు అక్రమ్.. 

కాగా 2009లో  అక్రమ్, తన భార్యతో కలిసి సింగపూర్ వెళ్తుండగా చెన్నైలో  హ్యూమాకు గుండెపోటు రావడంతో ఆమె ఇక్కడే మరణించింది. చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో ఆమె తుది శ్వాస విడిచింది. ఆమె మృతిని  కన్ఫర్మ్ చేశాక  హ్యూమాను మొదట ఢిల్లీకి తరలించి అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో లాహోర్ కు తీసుకెళ్లారు.  హ్యూమా చనిపోయిన తర్వాత అక్రమ్.. షనీరాను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఆస్ట్రేలియాకు చెందిన సోషల్ వర్కర్.

 

click me!