
Border-Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ క్రమంలో కీలకమైన రెండో టెస్టుకు ముందు భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి రానున్నారు. అంతకుముందు వెన్ను నొప్పితో బాధపడుతున్న అయ్యర్ రెండో టెస్ట్ కు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది సందిగ్దం నెలకొంది. అయితే, తాజాగా శ్రేయాస్ అయ్యర్ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడనీ, అతను బరిలోకి దిగనున్నాడని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ క్రమంలో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఢిల్లీలో జరిగే రెండో టెస్టుకు ముందు శ్రేయాస్ అయ్యార్ జట్టులో చేరనున్నారు. వెన్నునొప్పితో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్ జాతీయ క్రికెట్ అకాడమీలో విజయవంతంగా ఫిట్ నెస్ సాధించారు. బీసీసీఐ వైద్య బృందం అతను ఫిట్‌గా ఉన్నాడని సర్టిఫికెట్ ఇచ్చింది.
'భారత బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పితో జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. అతనికి బీసీసీఐ మెడికల్ టీమ్ ఫిట్ గా ఉన్నాడని సర్టిఫకెట్ ఇచ్చింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రెండో టెస్టుకు ముందు శ్రేయాస్ న్యూఢిల్లీలో జట్టుతో చేరనున్నాడు' అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.