Big Bash League: బిగ్ బాష్ లీగ్ లో పెర్త్ స్కార్చర్స్ ప్లేయర్ లారీ ఎవాన్స్ విధ్వంసం సృష్టించాడు. దీంతో అడిలైడ్ స్ట్రైకర్స్ పై పెర్త్ స్కార్చర్స్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Perth Scorchers - Laurie Evans: లారీ ఎవాన్స్ సుడిగాలి ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. 28 బంతుల్లోనే 85* పరుగులు చేసి అడిలైడ్ స్ట్రైకర్స్ ను 42 పరుగుల తేడాతో చిత్తు చేశాడు. లారీ ఎవాన్స్ ధనాధన్ ఇన్నింగ్స్ తో అడిలైడ్ స్ట్రైకర్స్ ను పెర్త్ స్కార్చర్స్ చిత్తుగా ఓడించింది. 13వ ఓవర్ లో బ్యాటింగ్ వచ్చిన పెర్త్ స్కార్చర్స్ బ్యాటర్ లారీ ఎవాన్స్.. కేవలం 18 బంతుల్లోనే అర్థ సెంచరీతో అదరగొట్టాడు. మొత్తం 28 బంతులు ఎదుర్కొన్న లారీ ఎవాన్స్ 85 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.
Laurie Evans has just played one of the GREAT T20 innings in Perth 🤩
Runs: 85*
Balls: 28
Strike Rate: 303.57 😱pic.twitter.com/k35go24IcE
మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ 20 ఓవర్లలో 211/4 పరుగులు చేసింది. అయితే, భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అడిలైడ్ స్ట్రైకర్స్ 19.2 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో పెర్త్ స్కార్చర్స్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. లాన్స్ మోరిస్ ఐదు వికెట్లు తీసుకున్నాడు.
సంక్షిప్త స్కోర్లు: పెర్త్ స్కార్చర్స్ 211/4 (ఇవాన్స్ 85*) అడిలైడ్ స్ట్రైకర్స్ 19.2 ఓవర్లలో 169 (షార్ట్ 74; మోరిస్ 5-24)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ.. టార్గెట్ ఐపీఎల్ 2024 టైటిల్ !