నువ్వే టీమ్‌లో చోటివ్వడం లేదు.. నేను మ్యాచ్‌లు ఎలా ఆడాలి..? రోహిత్ - ఇషాన్‌ల సంభాషణ వైరల్

Published : Jan 19, 2023, 12:52 PM IST
నువ్వే టీమ్‌లో చోటివ్వడం లేదు.. నేను మ్యాచ్‌లు ఎలా ఆడాలి..? రోహిత్ - ఇషాన్‌ల సంభాషణ వైరల్

సారాంశం

Shubman Gill: న్యూజిలాండ్ తో గురువారం ముగిసిన తొలి వన్డేలో భారత్  12 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ తర్వాత  డబుల్ సెంచరీ హీరోలు ఒక్కచోట కలిశారు. 

ఉప్పల్ వేదికగా ముగిసిన  తొలి వన్డేలో  భారత్..  ఉత్కంఠ పోరులో కివీస్ ను ఓడించి గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో  టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్.. డబుల్ సెంచరీ (208) తో కదం తొక్కాడు.  ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ధాటిగా ఆడిన  గిల్.. చివర్లో  భారీ హిట్టిగ్ కు దిగి భారత్ కు భారీ స్కోరును అందించాడు.  ఈ మ్యాచ్ కు కొద్దిరోజుల ముందు  బంగ్లాదేశ్ తో  జరిగిన మూడో వన్డేలో డబుల్ సెంచరీ చేశాడు ఇషాన్ కిషన్.   ఆ మ్యాచ్ తర్వాత  మళ్లీ ఇషాన్.. లంకతో వన్డే  సిరీస్ లో ఆడలేదు. కానీ మళ్లీ కివీస్ తో  వన్డేలకు  జట్టులోకి వచ్చాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఇద్దరు డబుల్ సెంచరీ హీరోలతో  తన కెరీర్ లో మూడు డబుల్ సెంచరీలు చేసిన టీమిండియా సారథి  రోహిత్ శర్మ  ప్రత్యేకంగా ముచ్చటించాడు.  ఇందుకు సంబంధించిన వీడియోను  బీసీసీఐ విడుదల చేసింది.  ఈ ముగ్గురి మధ్య సంభాషణ ఇలా సాగింది. 

రోహిత్ : ముందుగా నీకు కంగ్రాట్యులేషన్స్ గిల్..  నీకు ఎలా అనిపిస్తుంది..? మ్యాచ్ కు ముందు నీ రొటీన్ ఎలా ఉంటుంది..? 
హిట్ మ్యాన్ అడిగిన ప్రశ్నకు  గిల్ సమాధానం చెప్పబోతుండగా ఇషాన్ కూడా  నేను ఇదే ప్రశ్న అడగాలనుకుంటున్నా.. అని అన్నాడు.  అప్పుడు రోహిత్... ఆ విషయం నీక్కూడా తెలియాలి. మీ ఇద్దరూ ఒకే రూమ్ లో ఉంటారు కదా..? అని అడిగాడు. 

శుభమన్ గిల్ : ఇషాన్ నా  ప్రి మ్యాచ్ రొటీన్ ను మొత్తం పాడుచేస్తాడు.  ఐపాడ్ లో సినిమాలు చూస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా ఫుల్ సౌండ్  పెడతాడు. టీవీలలో సినిమాలు వచ్చినా అంతే. నేను  సౌండ్ తగ్గించమని ఎంత బతిలాడినా  వినడు.  ఈ విషయంలో మా ఇద్దరికీ నిత్యం గొడవ జరుగుతూనే ఉంటుంది.  ఇదే నా ప్రి మ్యాచ్ రొటీన్.

 

దానికి ఇషాన్ బదులిస్తూ..   నువ్వు నా గదిలో పడుకుంటున్నావ్. నేను చేయాల్సిన  రన్స్ నీ ఖాతాలో వేసుకుంటున్నావ్.. అందుకే ఇలా చేస్తున్నా అని చెప్పాడు. 

రోహిత్ :  ఇదంతా సరదాకి.. వీళ్లిద్దరూ మంచి మిత్రులు. చాలాకాలంగా   టీమిండియాకు ఆడుతున్నారు. ఈ ఇద్దరికీ మంచి భవిష్యత్ ఉంది. 

ఇక ఇంటర్వ్యూ ముగించబోయే ముందు  రోహిత్.. ‘అవును ఇషాన్.. నువ్వు డబుల్ సెంచరీ చేశాక మూడు వన్డేలు (లంకతో సిరీస్) ఆడలేదు. ఎందుకు..?’అని ప్రశ్నించాడు.  దానికి   ఇషాన్ స్పందిస్తూ.. ‘భయ్యా కెప్టెన్ వే నువ్వు.. నన్ను అడిగితే నేనేమి చెప్పను..?’ అని  అనడంతో ముగ్గురూ విరగబడి నవ్వారు.  

 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !