
ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న బెన్ స్టోక్స్... ఇంగ్లాండ్‌కి వరుస విజయాలు అందించాడు. బ్రెండన్ మెక్‌కల్లమ్ హెడ్ కోచింగ్‌లో, బెన్ స్టోక్స్ సారథ్యంలో ‘బజ్ బాల్’ కాన్సెప్ట్‌తో టెస్టు క్రికెట్‌కి కొత్త మెరుగులు అద్దుతోంది ఇంగ్లాండ్ టెస్టు టీమ్...
న్యూజిలాండ్ పర్యటనలో టెస్టు సిరీస్ ముగించుకున్న ఇంగ్లాండ్ జట్టు, ప్రస్తుతం టీ20 సిరీస్ ఆడుతోంది. మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉండడం కష్టమనే ఉద్దేశంతో గత ఏడాదిలోనే వన్డేల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు బెన్ స్టోక్స్. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు, టీ20 సిరీస్ ఆడుతోంది. తొలి రెండు టీ20ల్లో ఓడి, సిరీస్ కోల్పోయింది ఇంగ్లాండ్ టీమ్...
ఈ సిరీస్ నుంచి దూరంగా ఉన్న బెన్ స్టోక్స్, ఐపీఎల్ 2023 సీజన్‌కి ముందు స్వదేశానికి (న్యూజిలాండ్) వెళ్లి, కుటుంబంతో గడపాలని అనుకున్నాడు. అయితే లండన్‌లోని కింగ్స్ క్రాస్ రైల్వే స్టేషన్‌లో బెన్ స్టోక్స్ బ్యాగును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు బెన్ స్టోక్స్...
‘కింగ్స్ క్రాస్ రైల్వే స్టేషన్‌లో నా బ్యాగ్ ఎవరో కొట్టేశారో వాళ్లకు చెబుతున్నా... నా బట్టలు మీకు అస్సలు సరిపోవు.. చాలా పెద్దగా అవుతాయి...’ అంటూ కోపంతో రగిలిపోతున్నట్టు ఎమోజీ ట్వీట్ చేసి, తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు బెన్ స్టోక్స్.. బెన్ స్టోక్స్ ట్వీట్‌కి నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందన వస్తుంది. కొందరు బెన్ స్టోక్స్‌కి సానుభూతి చూపిస్తూ ట్వీట్లు చేస్తుంటే, మరికొందరు ఇదే ఛాన్స్‌గా జోకులు పేలుస్తున్నారు...
లండన్‌లో ఏదీ పోయినా, అది బ్రిటీష్ మ్యూజియంలో దొరుకుందని, అక్కడికి వెళ్లి వెతకాలని ఓ నెటిజన్ ట్వీట్ చేస్తే.. ‘ఇలాంటి సమయంలోనే మన పేరును ఇంకా గట్టిగా అరవాలని అనిపిస్తూ ఉంటుంది.. భారతీయులందరికీ ఇది కనెక్ట్ అవుతుంది...’ అంటూ మరో భారతీయుడు కామెంట్ చేశాడు...
ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలంలో బెన్ స్టోక్స్‌ని రూ.16 కోట్ల 25 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ప్లేయర్లలో ఒకడిగా రికార్డు క్రియేట్ చేశాడు బెన్ స్టోక్స్. ఐపీఎల్ 2023 మినీ వేలంలోనే ఇంగ్లాండ్ యంగ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్ ఏకంగా రూ.18 కోట్ల 50 లక్షలు దక్కించుకుని టాప్‌లో ఉన్నాడు..
మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో బెన్ స్టోక్స్ ఎలా ఆడతాడోనని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ధోనీకి ఇదే ఆఖరి సీజన్. మాహీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్‌గా బెన్ స్టోక్స్‌ని భావిస్తోంది టీమ్ మేనేజ్‌మెంట్. అందుకే బెన్ స్టోక్స్ కోసం ఇంత భారీ మొత్తం పెట్టేందుకు సీఎస్‌కే సిద్ధమైనట్టు సమాచారం..