ప్రాణం పెట్టి ఆడాను అయినా కూడా.. బీసీసీఐపై మండిపడ్డ యూవీ

By telugu news teamFirst Published Jul 27, 2020, 2:03 PM IST
Highlights

తానేమీ లెజెండ్‌ను కాదని, అయితే భారత్‌కు ఆడినప్పుడు ప్రాణం పెట్టి ఆడేవాడినని యువీ చెప్పాడు. తాను టెస్టు క్రికెట్‌ చాలా తక్కువగా ఆడానని, టెస్టుల్లో అమోఘమైన రికార్డులున్న కొంతమందికి ఫేర్‌వెల్‌ నిర్వహించిన విషయాన్ని యువీ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. 
 

ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరోసారి బీసీసీఐ పై మండిపడ్డాడు. తాను టీమిండియాకు వీడ్కోలు చేప్పే సమయంలో బీసీసీఐ ప్రవర్తించిన తీరు సరిగాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు వాళ్లని గౌరవించాల్సిన బాధ్యత బీసీసీఐకి ఉందని యూవీ పేర్కొన్నాడు.

గతేదాడి జూన్‌ 10వ తేదీన యువరాజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే తన రిటైర్మెంట్ సమయంలో బీసీసీఐ ప్రవర్తించిన తీరు అసంతృప్తి కలిగించిందని అన్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యువరాజ్ తన రిటైర్మెంట్‌కు సంబంధించి పలు విషయాలను షేర్‌ చేసుకున్నాడు.

తానేమీ లెజెండ్‌ను కాదని, అయితే భారత్‌కు ఆడినప్పుడు ప్రాణం పెట్టి ఆడేవాడినని యువీ చెప్పాడు. తాను టెస్టు క్రికెట్‌ చాలా తక్కువగా ఆడానని, టెస్టుల్లో అమోఘమైన రికార్డులున్న కొంతమందికి ఫేర్‌వెల్‌ నిర్వహించిన విషయాన్ని యువీ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. 

‘ఎవరైనా ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అతడికి  గౌరవంగా వీడ్కోలు పలకడమనేది బీసీసీఐ చేతిలో ఉంటుంది. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను. నా రిటైర్మెంట్ సమయంలో బీసీసీఐ ప్రవర్తించిన తీరు మాత్రం సరిగా లేదు. నా విషయంలోనే కాదు.. వీరేంద్ర సెహ్వాగ్, హర్బజన్ సింగ్, జహీర్ ఖాన్ వంటి అనేకమంది ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ ప్రవర్తించిన తీరు దారుణం. కానీ ఇది భారత క్రికెట్‌లో ఎప్పటినుంచో ఉంది. అందుకే నేనేమీ ఆశ్చర్యపోను. దాని గురించి అంతగా పట్టించుకోను’ అని యువీ తెలిపాడు. కనీసం భవిష్యత్తులోనైనా గొప్ప ఆటగాళ్లను బీసీసీఐ గౌరవించాలని ఆశిస్తున్నట్లు యువీ పేర్కొన్నాడు.

click me!