BCCI: ప్రధాని ఇలాఖాలో క్రికెట్ స్టేడియం.. బీసీసీఐ ఆర్థిక సాయం

Published : Jul 20, 2022, 04:27 PM ISTUpdated : Jul 20, 2022, 04:29 PM IST
BCCI: ప్రధాని ఇలాఖాలో క్రికెట్ స్టేడియం.. బీసీసీఐ ఆర్థిక సాయం

సారాంశం

Varanasi: ఉత్తరప్రదేశ్ లోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో క్రికెట్ స్టేడియం  నిర్మించేందుకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. 

ప్రధాని నరేంద్ర మోడీ  ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ స్టేడియానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆర్థిక సాయం చేయనున్నది. బీసీసీఐతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ స్టేడియం నిర్మాణంలో పాలు పంచుకోనున్నది. 

ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం లక్నో (గ్రీన్ పార్క్ స్టేడియం), కాన్పూర్ (ఎకనా స్టేడియం)లలో మాత్రమే అంతర్జాతీయ మ్యాచులు నిర్వహించేవిధంగా స్టేడియాలున్నాయి. కాన్పూర్ లో టెస్టులు జరుగుతుండగా లక్నో లో వన్డే, టీ20 లు ఆడిస్తున్నారు. 

అయితే లక్నో, కాన్పూర్ రెండు కూడా యూపీసీఏ ఆధ్వర్యంలో లేవు. లక్నో యూపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది. ఈ గ్రౌండ్ ను అద్దెకు తీసుకుని యూపీసీఏ అక్కడ మ్యాచులను నిర్వహిస్తున్నది. ఇక కాన్పూర్ స్టేడియాన్ని పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్దతిలో నిర్వహిస్తున్నారు. దీంతో యూపీలో యూపీసీఏ కు సొంత స్టేడియాన్ని నిర్మించాలనే తలంపుతో  వారణాసిలో కొత్త స్టేడియాన్ని నిర్మించనున్నారు. 

మోడీ నియోజకవర్గంలో నిర్మించబోయే ఈ స్టేడియానికి యూపీ ప్రభుత్వం  భూమిని ఇవ్వనుంది. ఇప్పటికే బీసీసీఐ ఉపాధ్యక్షుడు  రాజీవ్ శుక్లా, సెక్రటరీ జై షా లు వెళ్లి ఆ స్థలాన్ని పరిశీలించి అక్కడ స్టేడియం ఏర్పాట్లను పరిశీలించారని తెలుస్తున్నది. 

 

ఇక ఈ స్టేడియం నిర్మాణానికి రూ. 345 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు. దీనిలో సుమారు రూ. 90 కోట్ల వరకు బీసీసీఐ   ఆర్థిక సాయం చేయనున్నట్టు సమాచారం. దాదాపు 35వేల మంది సీటింగ్  కెపాజిటీతో ఈ స్టేడియాన్ని నిర్మించేందుకు  ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఈశాన్య యూపీలో  35వేల మంది సీటింగ్ కెపాజిటీతో స్టేడియాన్ని నిర్మించబోతున్నాం. ఇక్కడ అంతకుమించిన సామర్థ్యంతో  క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడం కూడా కరెక్ట్ కాదు..’ అని తెలిపాడు.

ఇదిలాఉండగా ఈ క్రికెట్ స్టేడియానికి ఏం పేరు పెడతారని ట్విటర్ లో నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటికే గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న మోతేరా స్టేడియం పేరు మార్చి నరేంద్ర మోడీ స్టేడియంగా మార్చిన విషయం తెలిసిందే. మరి అలాంటిది ప్రధాని  ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నిర్మించబోయే ఈ స్టేడియానికి కూడా మోడీ పేరే పెడతారా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే