బీసీసీఐ రాజ్యాంగానికి సవరణ: దాదా పదవీకాలం పొడిగింపు.. బంతి ‘‘సుప్రీం’’ కోర్టులో

By Siva KodatiFirst Published Nov 11, 2019, 4:45 PM IST
Highlights

భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పదవీకాలాన్ని పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆమోదించిన బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించాలని పెద్దలు భావిస్తున్నారు. 

భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పదవీకాలాన్ని పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆమోదించిన బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించాలని పెద్దలు భావిస్తున్నారు.

డిసెంబర్ 1న గంగూలీ అధ్యక్షతన సమావేశమయ్యే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవచ్చు. ఈ ప్రతిపాదనకు బీసీసీఐ బోర్డులోని నాలుగింట మూడో వంతు మద్ధతుతో పాటు సుప్రీంకోర్టు ఆమోదం సైతం తప్పనిసరి.

ఒకవేళ సర్వోన్నత న్యాయస్థానం గనుక ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే గంగూలీ ఆరేళ్లపాటు బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. గంగూలీ తొమ్మది నెలలపాటే బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అవకాశం ఉంది. 

Also Read:గంగూలీ మార్క్: ఇక డే అండ్ నైట్ టెస్ట్, ఈడెన్ గార్డెన్ లో తొలి మ్యాచ్

ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడిగా తన మార్క్ చూపిస్తున్నారు. డే అండ్ నైట్ టెస్టులకు బీసీసీఐ శ్రీకారం చుట్టనుంది. తొలి డే మ్యాచ్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో నిర్వహించాలని ప్రతిపాదించింది. ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగే రెండో మ్యాచ్ ను డే అండ్ నైట్ మ్యాచ్ గా నిర్వహించాలని బీసీసీఐ బీసీబీకి ప్రతిపాదన పంపించింది. 

బిసీసీఐ ప్రతిపాదనకు బెంగాల్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఆమోదం తెలియజేయాల్సి ఉంది. బీసీసీఐ ప్రతిపాదినపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని బీసీబీ క్రికెట్ ఆపరేషన్ చైర్మన్ అక్రమ్ ఖాన్ ఆదివారంనాడు మీడియాకు తెలియజేశారు 

బీసీసీఐ నుంచి రెండు మూడు రోజుల క్రితం తమకు లేఖ వచ్చిందని, దానిపై తాము నిర్ణయం తీసుకుంటామని, అయితే ఆ విషయంపై తాము ఇంకా చర్చించలేదని, ఒకటి రెండు రోజుల్లో తమ నిర్ణయం తెలియజేస్తామని ఆయన చెప్పారు. 

Also read:రవిశాస్త్రిని మరోలా వాడుకుందాం... గంగూలీ కామెంట్స్

కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించినందున తొలి డే అండ్ నైట్ మ్యాచ్ బంగ్లాదేశ్ సిరీస్ సందర్భంగానే జరుగుతుందని సౌరవ్ గంగూలీ చెప్పారు. బంగ్లాదేశ్ తో తొలి టెస్టు మ్యాచ్ నవంబర్ 14వ తేదీన ప్రారంభమవుతుంది. రెండో టెస్టు మ్యాచ్ నవంబర్ 22వ తేదీనుంచి ఈడెన్ గార్డెన్ లో జరుగుతుంది.

ఆటగాళ్లు, టీమ్ మేనేజ్ మెంట్ అభిప్రాయం తీసుకున్న తర్వాతనే డే అండ్ నైట్ మ్యాచ్ పై నిర్ణయం తీసుకుంటామని బీసీబీ చీఫ్ నిజాముద్దీన్ చౌదరి చెప్పారు. డే అండ్ నైట్ మ్యాచు అయితే గులాబీ బంతితో ఆడాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. 

click me!