కరోనా కలకలం: అప్రమత్తమైన బీసీసీఐ.. ఆటగాళ్లకు కఠిన నిబంధనలు

By Siva KodatiFirst Published Apr 4, 2021, 7:38 PM IST
Highlights

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో బీసీసీఐ అప్రమత్తమైంది. మరో ఆరు రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ టోర్నీపై కరోనా ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో బీసీసీఐ అప్రమత్తమైంది. మరో ఆరు రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ టోర్నీపై కరోనా ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఆటగాళ్లు, సిబ్బంది వైరస్ బారినపడిన పడకుండా పూర్తిగా బయోబబుల్ వాతావరణంలోనే ఐపీఎల్ టోర్నీని నిర్వహించాలని నిర్ణయించిన బీసీసీఐ కేవలం ఆరు వేదికల్లోనే మ్యాచ్‌లను నిర్వహించాలని భావిస్తోంది.

అంతేకాదు... కోవిడ్ దృష్ట్యా ఈసారి ప్రేక్షకులను అనుమతించబోమని చెబుతున్నారు బీసీసీఐ అధికారులు. బయోబబుల్‌లో ఐపీఎల్ టోర్నీలు జరిగితే ఇకపై ఆటగాళ్లు ఎటు వెళ్ళాలన్నా బీసీసీఐ అనుమతి తప్పనిసరి.

సీజన్ ముగిసే వరకు బోర్డ్ క్రియేట్ చేసిన బయోబబుల్‌లోనే వుంటూ కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే. మరోవైపు ఆటగాళ్లకు వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేస్తామని బీసీసీఐ ఉన్నతాధికారులు చెబుతున్నారు.  

ఐపీఎల్‌ 2021 సీజన్ మ్యాచ్‌లను ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నైసిటీల్లో నిర్వహించాలని బీసీసీఐ ఆశించింది. కానీ.. గత కొద్దిరోజులుగా మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరగడంతో.. ముంబయిని ఆ ఆతిథ్య జాబితాల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. కాగా, ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14 సీజన్ ప్రారంభమవుతోంది. 

click me!