కరోనాతో దేశం లాక్‌డౌన్: ఫిట్‌నెస్ పెంచుకుంటున్న పంత్, వీడియో వైరల్

By Siva KodatiFirst Published Mar 27, 2020, 7:46 PM IST
Highlights

ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచంలోని అన్ని క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోయిన సమయంలో భారత యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఖాళీ సమయంలో ఫిట్‌నెస్‌ మెరుగు పరచుకునేందుకు యత్నిస్తున్నాడు

ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచంలోని అన్ని క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోయిన సమయంలో భారత యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఖాళీ సమయంలో ఫిట్‌నెస్‌ మెరుగు పరచుకునేందుకు యత్నిస్తున్నాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం బీసీసీఐ ఓ వీడియోను తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. 

కోవిడ్ 19 కారణంగా ప్రధాని నరేంద్రమోడీ 21 రోజులు దేశంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో ఈ ఖాళీ సమయాన్ని పంత్ ఉపయోగించుకుంటున్నాడు. అందులో భాగంగా రిషభ్ పుష్‌అప్‌లు, ట్రెడ్‌మిల్‌పై పరుగులు తీయడం వంటి పనులు చేస్తున్నాడు.

Also Read:హెడ్డింగ్ కాదు.. వార్త మొత్తం చదువు.. అభిమానికి స్టోక్స్ పంచ్

మరోవైపు కరోనా నేపథ్యంలో క్రికెటర్లు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటున్నారు. కోవిడ్ 19 గురించి అవగాహన కల్పించడంతో పాటు వారి రోజువారీ కార్యక్రమాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ వారం ప్రారంభంలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ భార్యతో గడిపిన వీడియోలను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ధావన్ బట్టలు  ఉతకడం, వాష్‌రూమ్‌ శుభ్రం చేస్తున్నాడు. అయితే ఆ సమయంలో అతని భార్య స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించింది.

Also Read:రూ.800కోట్ల ఆదాయం..కరోనా బాధితుకు రూ.లక్ష విరాళం.. ధోనీపై ట్రోల్స్

ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో బాలీవుడ్ హిట్ సాంగ్ ‘‘జబ్ సే హుయ్ హై షాదీ’’ ప్లే అవుతోంది. కాగా భారత్- దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌ కరోనా కారణంగా వాయిదా పడింది. దీనితో పాటు ఐపీఎల్ 2020 కూడా ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Indoor workout featuring 💪💪💪 pic.twitter.com/iOqWcVr3k9

— BCCI (@BCCI)
click me!