
క్రికెట్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఐపీఎల్ ముగిసింది. రెండ నెలల పాటు సరదాగా సాగిన ఈ ఐపీఎల్ 2022 సీజన్ లో... గుజరాత్ టైటాన్స్ కొత్త ఛాంపియన్ గా నిలిచింది. కాగా... ఈ ఐపీఎల్ ముగిసిన వెంటనే.. టీమిండియా... మళ్లీ మరో సీరిస్ కోసం సిద్ధమౌతున్నారు. త్వరలోనే దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరగనుండగా... దీని కోసం టీమిండియా సిద్ధమౌతోంది. వారం రోజుల్లో వీరు దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం అక్కడకు బయలుదేరనున్నారు.
భారత క్రికెట్ జట్టు ద్వైపాక్షిక సిరీస్‌ల సుదీర్ఘ జాబితాలో పాల్గొనననుంది. మొదట దక్షిణాఫ్రికాతో జరగనున్న మ్యాచ్ లో జట్టుకి కేఎల్ రాహుల్ న్యాయకత్వం వహించనున్నాడు. రెగ్యులర్ టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ , జస్ప్రీత్ బుమ్రా వంటి వారితో కలిసి జూలై 1 నుండి వన్-ఆఫ్ టెస్ట్ కోసం నేరుగా ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నారు.
రోహిత్ శర్మ సేన ఆసియా కప్ 2022లో , ఇంగ్లాండ్, ఐర్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక , ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లలో కూడా పాల్గొంటుంది, ఆపై T20 ప్రపంచ కప్ 2022 లో పాల్గొంటుంది.
India vs South Africa – June (5 T20Is)
India tour of Ireland – June (2 T20Is)
India tour of England – June -July (1 Test, 3 ODIs, 3 T20Is)
India tour of West Indies – July/August (3 ODIs, 5 T20Is)
India tour of Sri Lanka – August (2 T20Is)
Asia Cup 2022 – August / September
India vs Australia – September (3 T20Is)
T20 World Cup 2022 – October /November
ఆస్ట్రేలియాలో జరగనున్న T20 ప్రపంచ కప్ 2022 కోసం టీమ్ ఇండియా దాదాపు 25 T20I గేమ్‌లను ఆడేందుకు సిద్ధంగా ఉంది.మొదటిగా, దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ తో మొదలు పెట్టనుంది.
రోహిత్ శర్మ, మిగిలిన జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లి ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌కు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలో మూడు సన్నాహక గేమ్‌లు, 3 ODIలు, 3 T20Iలతో పాటు గత సంవత్సరం నుండి వాయిదా పడిన 5వ టెస్ట్ ఉన్నాయి.