బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ధరించిన బ్లేజర్ ప్రత్యేకత ఇదే..

Published : Oct 23, 2019, 06:01 PM ISTUpdated : Oct 23, 2019, 06:11 PM IST
బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ధరించిన బ్లేజర్ ప్రత్యేకత ఇదే..

సారాంశం

తాను బిసీసీఐ అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టిన ఈ రోజు ధరించిన బ్లేజర్ పై సౌరవ్ గంగూలీ ఆసక్తికరమైన విషయం చెప్పారు. టీమిండియా కెప్టెన్ గా ఉన్నప్పుడు వేసుకున్న బ్లేజర్ ఇదేనని చెప్పాడు.

ముంబై: బీసీసీఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సౌరవ్ గంగూలీ బుధవారం ముంబైలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. 65 ఏళ్ల తర్వాత బీసీసీఐ పూర్తి కాలం అధ్యక్షుడు కావడం ఇదే. బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రశంసించాడు. ఎంఎస్ ధోనీ భవితవ్యంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు టీమిండియాను నడిపించినట్లుగానే బీసీసీఐని నడిపిస్తానని చెప్పారు గంగూలీ బుధవారం ధరించిన బ్లేజర్ కు ఓ ప్రత్యేకత ఉంది. 

Also Read: త్వరగా ఫినిష్ చేయరు: ధోనీపై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత జట్టు కెప్టెన్ గా ఎంపికైనప్పుడు ధరించిన బ్లేజర్ నే ఆయన బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించే సమయంలో వేసుకున్నారు. అదే బ్లేజర్ ధరించి మీడియాతో మాట్లాడారు. భారత జట్టు కెప్టెన్ గా ఉన్నప్పుడు ఈ బ్లేజర్ ను తీసుకున్నానని, దాన్ని ఈ రోజు ధరించాలని నిర్ణయం తీసుకున్నానని, అయితే అది లూజ్ అయిందనే విషయాన్ని గమనించలేదని ఆయన నవ్వుతూ అన్నారు.

బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నికయ్యాడు. ధోనీ తనంత తానుగా నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన వెసులుబాటును కల్పిస్తానని చెప్పాడు. గంగూలీ టెస్టు క్రికెట్ నుంచి 2008లో రిటైర్ అయ్యారు. 16 సెంచరీలతో 7,212 పరుగులు చేశాడు. 

 

PREV
click me!

Recommended Stories

Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు
IND vs SA : టీ20 క్రికెట్ అంటే అంతే బాసూ.. సూర్యకుమార్ యాదవ్ భయం అదే !