జమ్మూ కశ్మీర్ ను విభజన... రంజీ జట్టు విభజనపై బిసిసిఐ క్లారిటీ

By Arun Kumar PFirst Published Aug 6, 2019, 7:46 PM IST
Highlights

జమ్ము కశ్మీర్ రంజీ జట్టు విషయంలో ఆటగాళ్లు, అభిమానులకు నెలకొన్న అనుమానాలపై సీవోఏ చైర్మన్ వినోద్ రాయ్ క్లారిటీ ఇచ్చాడు. ఆ రాష్ట్రం రెండుగా విడిపోయినా రంజీ జట్టు మాత్రం ఒక్కటే వుంటుందని స్పష్టం చేశాడు.  

కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ విభజనను చేపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ రాష్ట్రాన్ని జమ్మూకాశ్మీర్, లడఖ్ రెండు ప్రాంతాలుగా  విడగొట్టి వాటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడానికి  కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇలా రాష్ట్రం రెండుగా విడిపోనుండటంతో రంజీ జట్టు కూడా ఇదే మాదిరిగా విడిపోతుందేమో అన్న అనుమానం స్ధానికులతో పాటు దేశంలోని  క్రికెట్ ప్రియులకు కలుగుతోంది. దీంతో ఈ సందేహాలపై  బిసిసిఐ క్లారిటీ ఇచ్చింది.

రంజీ  క్రికెట్ లో ఇప్పటికే జమ్మూ కశ్మీర్ జట్టు వుంది. ఈ జట్టు యదావిధిగా కొనసాగుతుందని బిసిసిఐ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సీవోఏ(క్రికెట్ గవర్నింగ్ కౌన్సిల్) ఛైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు. లడఖ్ ప్రాంతానికి చెందిన యువ క్రికెటర్లు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. 

ఇంతకు ముందు మాదిరిగానే మంచి ప్రతిభ కలిగిన వారికి జమ్మూకాశ్మీర్ జట్టులో చోటు దక్కుంతుందని హామీ ఇచ్చారు. రాష్ట్రం విడిపోయినా, రెండు కేంద్ర పాలితప్రాంతాలుగా మారినా రంజీ జట్టులో ఎలాంటి మార్పు వుండదని రాయ్ క్లారిటీ ఇచ్చారు. 

ఇక జమ్మేకాశ్మీర్ రాష్ట్రవిభజన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. నిన్న(సోమవారం) రాజ్యసభలో ఆమోదం పొందింది విభజన బిల్లు ఇవాళ(మంగళవారం) లోక్ సభలో ఆమోదాన్ని కూడా పొందింది. ఇలా రాష్ట్రం రెండుగా విడిపోయినా రంజీ క్రికెట్ జట్టు మాత్రం కలిసే వుండనుంది. 
 

click me!