రోహిత్ తో వివాదం... కెప్టెన్ కోహ్లీ అంతపని చేయనున్నాడా...?

Published : Jul 29, 2019, 02:29 PM ISTUpdated : Jul 29, 2019, 02:34 PM IST
రోహిత్ తో వివాదం... కెప్టెన్ కోహ్లీ అంతపని చేయనున్నాడా...?

సారాంశం

టీమిండియా క్రికెట్ జట్టు ఇవాళ(సోమవారం) వెస్టిండిస్ కు పయనమవ్వనుంది. ఈ సందర్భంగా నిర్వహించనున్న ప్రెస్ మీట్ కు విరాట్ కోహ్లీ డుమ్మా కొట్టాలని భావిస్తున్న జరుగుతున్న ప్రచారంపై బిసిసిఐ స్పందించింది.  

భారత క్రికెట్ టీంలో ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ చిచ్చు పెట్టింది. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ల మధ్య ఈ మెగా టోర్నీలో ఆధిపత్య పోరు సాగి బేదాభిప్రాయాలు తలెత్తినట్లు ఓ వార్త తెగ ప్రచారమవుతోంది. ఇలా టీమిండియా సీనియర్లిద్దరి మధ్య సాగిన కోల్డ్ వార్ చివరకు వెస్టిండిస్ సీరిస్ కు పాకినట్లు మరో వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. వెస్టిండిస్ పర్యటనకు ముందు నిర్వహించనున్న ప్రెస్ మీట్ కు కోహ్లీ డుమ్మా కొట్టనున్నాడన్న ఈ ప్రచారాన్ని బిసిసిఐ(భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్) తాజాగా ఖండించింది. 

ప్రతి సీరిస్ కు ముందు టీమిండియా కెప్టెన్ ప్రెస్ మీట్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా సాంప్రదాయం వెస్టిండిస్ పర్యటనలోనూ కొనసాగుతుందని బిసిసిఐ  వెల్లడించింది. ఇవాళ(సోమవారం) భారత జట్టు వెస్టిండిస్ కు బయలుదేరనున్న నేపథ్యంలో కోహ్లీ మీడియా సమావేశం వుంటుందని...అతడు తప్పకుండా ఆ సమావేశంలో పాల్గొంటాడని స్పష్టం చేసింది. అతడు ఈ విలేఖర్ల సమావేశానికి డుమ్మా కొట్టనున్నాడంటూ జరుగుతున్న ప్రచారంలో  ఏమాత్రం నిజం లేదని బిసిసిఐ అధికారులు తెలిపారు. 

ప్రస్తుతం కోహ్లీ-రోహిత్ ల మధ్య బేదాభిప్రాయాలు టీమిండియా ఆటగాళ్ల కు పాకినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఈ ప్రభావం విండీస్ పర్యటనలో టీమిండియా ప్రదర్శనపై తప్పకుండా పడనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రెస్ మీట్ లో పాల్గొంటే ఈ విషయాలపైనే ఎక్కువగా ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వుంటుంది. కాబట్టి ఈ సమావేశానికి డుమ్మా కొడితేనే మంచిదని కోహ్లీ భావిస్తున్నట్లుగా ఓ వార్త ప్రచారామవగా బిసిసిఐ దానని కొట్టిపారేసింది. 
 

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?