గుండెల్లో అక్క లేదన్న బాధ: పంటిబిగువున భరించి.. జట్టును విశ్వవిజేతగా నిలిపాడు

By Siva KodatiFirst Published Feb 10, 2020, 10:14 PM IST
Highlights

బంగ్లాదేశ్ విజయం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించింది కెప్టెన్ అక్బర్ అలీనే. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్న సమయంలో క్రీజులోకి వచ్చిన అక్బర్ నాయకుడిగా పోరాడాడు.

ఐసీసీ మెగా టోర్నీల్లో తొలిసారి సత్తా చాటిన బంగ్లాదేశ్ ఆ జోష్‌ను ఎంజాయ్ చేస్తోంది. అండర్-19 ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌ను ఓండించి మొదటిసారి విశ్వవిజేతగా అవతరించిన సంగతి తెలిసిందే.

అయితే ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించింది కెప్టెన్ అక్బర్ అలీనే. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్న సమయంలో క్రీజులోకి వచ్చిన అక్బర్ నాయకుడిగా పోరాడాడు.

Also Read:మా వాళ్లు అతి చేశారు.. క్షమించండి: బంగ్లా కెప్టెన్ అక్బర్ అలీ

ఓ వైపు సహచరులు ఒక్కొక్కరిగా పెవిలియన్ బాట పడుతున్నా.. మొక్కవోని దీక్షతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. పర్వేజ్ ఇమాన్‌ (47)తో కలిసి కీలకమైన 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.

అయితే అతని ఆనందం వెనుక అంతులేని విషాదం ఉంది. అండర్-19 టోర్నీలో ఉండగానే అక్బర్ సోదరి ఖాదిజా ఖాతున్ మరణించినట్లు బంగ్లాదేశ్‌కు చెందిన ‘‘ప్రోథమ్ ఆలో’’ అనే వార్తాపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

గత నెల 22న కవలలకు జన్మనిస్తూ ఆమె కన్నుమూశారని రాసింది. ఖాదిజా మరణానికి కొద్దిరోజుల ముందే.. జనవరి 18న గ్రూప్-సీలో భాగంగా జింబాబ్వేతో జరిగి మ్యాచ్‌లో అక్బర్ జట్టును గెలిపించడాన్ని ఆమె వీక్షించారు.

Also Read:అండర్ 19 ఫైనల్: బంగ్లాదేశ్ క్రికెటర్ల చెత్త ప్రవర్తన, అగ్లీ సీన్స్

ఈ క్రమంలో కీలకమైన ఫైనల్‌లో, బలమైన భారత్‌పై కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి ట్రోఫీని గెలిపించిన సోదరుడి ఆటను ఖాతున్ చూడలేకపోయారని ఆ పత్రిక ప్రచురించింది. అయితే తన సోదరి మరణవార్తను కుటుంబసభ్యులు తెలపలేదని, ఇతరుల ద్వారా ఈ విషాద వార్తను తెలుసుకున్న అక్బర్ ఈ విషయమై తన సోదరుడిని నిలదీసినట్లుగా తెలుస్తోంది.

ఈ సంఘటన తర్వాత బంగ్లాదేశ్.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లను ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈ టోర్నీలో ఏ మ్యాచ్‌లోనూ రాణించలేక విమర్శలు ఎదుర్కొంటున్న అక్బర్ ఫైనల్లో మాత్రం అద్బుతంగా ఆడి 43 పరుగులు చేయడం విశేషం. 

click me!