Abid Ali: పిల్లికి బిచ్చం పెట్టిన పాకిస్థాన్ క్రికెటర్.. ట్విట్టర్ లో వైరల్ అవుతున్న వీడియో

By team teluguFirst Published Dec 8, 2021, 3:05 PM IST
Highlights

Bangladesh Vs Pakistan: పాకిస్థాన్ ఓపెనర్ అబిద్ అలీ చేసిన పని  ఇంటర్నెట్ లో నెటిజనుల హృదయాలను తాకింది. లంచ్ కు వెళ్లే సమయంలో అతడు.. అక్కడే ఉన్న పిల్లికి భోజనం తినిపించాడు.

తెలుగులో ఓ నాటు సామెత ఉంది. ‘పిల్లికి బిచ్చం పెట్టనోడు పిలిచి పిల్లనిస్తాడా..?’.. పిసినారి వ్యక్తుల గురించి చెప్పే సందర్బంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. పిల్లి తినేది ఎంత..? గట్టిగా చెప్పాలంటే నాలుగు ముద్దలు. దానికి కూడా బిచ్చం పెట్టలేనోడు ఇతరులకు ఏం సాయం చేస్తాడని అర్థం వచ్చేలా దీనిని ఉపయోగిస్తారు. అయితే తాజాగా  పాకిస్థాన్ క్రికెటర్ అబిద్ అలీ మాత్రం..  ఆకలితో ఉన్న పిల్లికి భోజనం పెట్టాడు. లంచ్ టైంలో తాను తినడమే కాదు.. మూగ జీవాలకు కూడా తినిపిస్తూ నెటిజనుల అభిమానాన్ని పొందుతున్నాడు. 

ఇంతకీ ఏమైందంటే.. పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఢాకా వేదికగా జరుగుతున్న రెండో టెస్టు ఐదో రోజు ఇరు జట్లు లంచ్ కు వెళ్లడానికి సిద్ధమయ్యాయి. పాకిస్థాన్ జట్టు రెస్టారెంట్ కు వెళ్తున్న సందర్భంలో అక్కడే ఉన్న ఓ పిల్లి ఆకలితో అక్కడే కూలబడిపోయి ఉంది. దానిని చూసి పాక్ క్రికెటర్ అబిద్ అలీ చలించాడు. 

 

It is not only the players who are taking lunch pic.twitter.com/wZ0k3ErPZW

— Pakistan Cricket (@TheRealPCB)

అక్కడే ఉన్న భోజనం ప్లేట్ ను తీసుకువచ్చి ఆ పిల్లి ముందు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్.. తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. వీడియో షేర్ చేస్తూ.. ‘లంచ్ అంటే ప్లేయర్లకే కాదు..!’ అని రాసుకొచ్చింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. 

ఓటమి అంచున బంగ్లాదేశ్ : 

ఇదిలాఉండగా.. రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఓటమి అంచున నిలిచింది.  తొలి ఇన్నింగ్స్ లో సాజిద్ అలీ స్పిన్ మాయాజాలానికి 87 పరుగులకే ఆలౌట్ అయిన బంగ్లా.. రెండో ఇన్నింగ్స్ లో కూడా దారుణంగా విఫలమైంది. ఫాలో ఆన్ ఆడుతున్న ఆ జట్టు... రెండో ఇన్నింగ్స్ లో 159 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఆట ఆఖరు రోజు కావడంతో ఓటమి నుంచి తప్పించుకోవాలంటే ఆ జట్టు ఈ రోజంతా నిలబడాల్సిందే. కానీ పాక్ బౌలర్లను తట్టుకుని బంగ్లా నిలువగలదా..? 

కాగా, తొలి ఇన్నింగ్స్ లో పాక్ 300 పరుగులు చేసి డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. ఆ జ్టటులో ఏకంగా నలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేశారు. బాబర్ ఆజమ్, ఆలమ్, రిజ్వాన్, అజర్ అలీ లు రాణించారు. ఇక తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్.న. 87 పరుగులకే ఆలౌట్ అయింది. స్పిన్నర్ సాజిద్ ఖాన్..  ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. 

click me!