మళ్లీ క్రికెట్ బ్యాట్ పట్టి అలరించిన అజారుద్దీన్(వీడియో)

By Sree sFirst Published Jun 6, 2020, 11:07 AM IST
Highlights

భారతదేశ మాజీ సారథి క్రికెట్ దిగ్గజం, హైద్రాబాదీ బ్యాట్స్ మెన్ అజారుద్దీన్ తాజాగా మరోసారి క్రికెట్ బాట్ పట్టాడు. 2000 సంవత్సరంలో ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో  జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. 2000 సంవత్సరంలో జరిగిన ఈ సంఘటన తరువాత అజారుద్దీన్ క్రికెట్ బ్యాట్ పట్టింది లేదు. ఆ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకున్న తరువాత అతని కెరీర్ అర్థాంతరంగా ముగిసింది. 

ఇక తాజాగా అజారుద్దీన్ ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోని అజారుద్దీన్ స్టాండ్ ముందు క్రికెట్ బ్యాటు పట్టుకొని చేతికి గ్లవ్స్ వేసుకొని  చేసారు. బంతులను ఎదుర్కొంటు తనదైన ట్రేడ్ మార్క్ షాట్లను ఆడాడు. బ్యాట్ ను అలవోకగా తిప్పుతూ గతంలో అజర్ బ్యాటు పట్టుకున్న సన్నివేశాలను గుర్తుకుచేసాడు. 

దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో స్వయంగా అజారుద్దీన్ ట్విట్టర్లో ట్వీట్ చేసాడు. అభిమానులు ఆ వీడియోను చూసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Knock knock... timing it like old times 😀 pic.twitter.com/Rkgl0PNG7i

— Mohammed Azharuddin (@azharflicks)

ఇకపోతే... క్రీయాశీల రాజకీయాలకు దూరమైనా.. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధ్యక్ష పగ్గాలను అజారుద్దీన్ అందుకున్న విషయం తెలిసిందే. జస్టిస్‌ లోధా కమిటీ బీసీసీఐ సహా రాష్ట్ర క్రికెట్‌ సంఘాలను మాజీ క్రికెటర్లు నడపాలని అభిలాశించింది. 

కళంకిత క్రికెటర్‌గా మరక తుడుచుకునే పనిలో పడిన అజహరుద్దీన్‌, హెచ్‌సీఏలో అవినీతి అంతం చూసేందుకు వచ్చానని పదవీలోకి వచ్చిన అనంతరం పేర్కొన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడి సౌరభ్‌ గంగూలీతో సాన్నిహిత్యంతో అజహరుద్దీన్‌కు ఇప్పుడు బీసీసీఐలోకి మంచి గుర్తింపు లభిస్తోంది. 

ఆ సందర్భంగా భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ దిగ్గజ క్రికెటర్ అజహరుద్దీన్ పేరున కూడా ఒక స్టాండ్ ఏర్పాటు చేసారు. ఇప్పటివరకు హైదరాబాద్‌ నుంచి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన స్టార్‌ ఆటగాళ్లలో మహ్మద్‌ అజహరుద్దీన్‌ ఒకరు. వీవీఎస్‌ లక్ష్మణ్‌, ఎన్‌.శివలాల్‌ యాదవ్‌ పేరిట ఇప్పటికే స్టేడియంలో రెండు వైపులా పెవిలియన్‌లు ఉన్నాయి.

click me!