స్మిత్ తలను తాకిన బంతి.. హ్యూస్ గుర్తొచ్చాడన్న వార్నర్

Siva Kodati |  
Published : Mar 16, 2020, 02:51 PM IST
స్మిత్ తలను తాకిన బంతి.. హ్యూస్ గుర్తొచ్చాడన్న వార్నర్

సారాంశం

2014లో ఆస్ట్రేలియాకు చెందిన ఫిల్ హ్యూస్ షెఫీల్డ్ షీల్డ్ క్రికెట్ ఆడుతుండగా తలకు బంతి బలంగా తగలడంతో మైదానంలో కుప్పకూలి మరణించాడు. దీంతో అప్పటి నుంచి ఆసీస్ బ్యాట్స్‌మెన్లు బౌన్సర్లను ఎదుర్కోవాలంటేనే భయపడిపోతున్నారు

యాషెస్ సిరీస్‌ అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఎంతటి క్రేజ్ ఉంటుందో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్లు తలపడే ఈ సిరీస్‌కు అంతే పాపులారిటీ ఉంటుంది. బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత ఏడాది పాటు నిషేధాన్ని ఎదుర్కొన్న ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్‌కు గతేడాది యాషెస్ సిరీస్‌ ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోయింది.

రీ ఎంట్రీ తర్వాత రెచ్చిపోయిన స్మిత్ ఈ సిరీస్‌లో 774 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. అయితే ఈ సిరీస్‌ సందర్భంగా అతడు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో తీవ్రంగా గాయపడిన విషయం కూడా అంతే హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనతో ఆసీస్ క్రికెటర్లు ఒక్కసారిగా వణికిపోయారు.

Also Read:వాళ్లకి నచ్చేలేదేమో... బీసీసీఐ వేటుపై మంజ్రేకర్ స్పందన

దీనికి కారణం లేకపోలేదు 2014లో ఆస్ట్రేలియాకు చెందిన ఫిల్ హ్యూస్ షెఫీల్డ్ షీల్డ్ క్రికెట్ ఆడుతుండగా తలకు బంతి బలంగా తగలడంతో మైదానంలో కుప్పకూలి మరణించాడు. దీంతో అప్పటి నుంచి ఆసీస్ బ్యాట్స్‌మెన్లు బౌన్సర్లను ఎదుర్కోవాలంటేనే భయపడిపోతున్నారు.

ఈ క్రమంలో స్మిత్‌ తలకు గాయం కావడంతో తామంతా కంగారు పడ్డామని ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. ఆస్ట్రేలియాలో క్రికెట్‌పై అమెజాన్ ప్రైమ్ ‘‘ ది టెస్ట్’’ అనే డాక్యుమెంటరీ వీడియో విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన వార్నర్ యాషెస్ అనుభవాల్ని తెలిపాడు.

Also Read:క్రికెటర్ ఉనద్కత్ నిశ్చితార్థం: కాబోయే భార్య ఎవరంటే....

స్మిత్‌ తలకు బంతి తగిలి కిందపడగానే.. మళ్లీ అలాంటి దుర్ఘటన కాకూడదని కోరుకున్నామిన వార్నర్ చెప్పాడు. ఇదే విషయంపై పీటర్ సిడిల్ స్పందిస్తూ.. స్మిత్ కిందపడగానే షాకయ్యామని, అతనిని చూసి భయపడ్డామని తెలిపాడు.

మరో క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా మాట్లాడుతూ.. బంతి అలా తగులుతుందని అస్సలు ఊహించలేదన్నాడు. తాను చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నప్పటికీ.. హ్యూస్ మరణించే వరకు క్రికెట్‌లో అలా బంతి తగిలి మరణిస్తారనే విషయం తనకు తెలియదన్నాడు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: టీమిండియాకు తలనొప్పిగా మారిన స్టార్ ప్లేయర్ !
IND vs SA : టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలివే.. గంభీర్ దెబ్బ !