వాళ్లకి నచ్చేలేదేమో... బీసీసీఐ వేటుపై మంజ్రేకర్ స్పందన

By telugu news teamFirst Published Mar 16, 2020, 12:53 PM IST
Highlights

తనను బీసీసీఐ తొలగించిన విషయం వాస్తవమేనని తన వ్యాఖ్యల ద్వారా వెల్లడించాడు. దీనిపై ట్విట్టర్‌లో స్పందించిన మంజ్రేకర్.. బీసీసీఐ నిర్ణయాన్ని పక్కా ప్రొఫెషనల్‌గా అంగీకరిస్తున్నానని తెలిపాడు.

వివాదాస్పద క్రికెట్ కామెంటేటర్, ఇండియన్ మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. కామెంటరీ ప్యానెల్ నుంచి మంజ్రేకర్ ని తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కాగా... ఈ వార్తలపై తాజాగా మంజ్రేకర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

సంజయ్ మంజ్రేకర్‌ ని ప్యానెల్ నుంచి తొలగించడానికి గల కారణాలను బీసీసీఐ స్పష్టంగా తెలియజేయలేదు. అయితే... అతని పనితీరుపై బీసీసీఐ సంతృప్తికరంగా లేదన్న విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.ఈ క్రమంలోనే బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. కాగా..  మంజ్రేకర్‌పై వేటు అని వార్తలు వస్తున్నా.. అధికారిక సమాచారం ఏదీ లేదు. 

Also Read రవీంద్ర జడేజా దెబ్బ: సంజయ్ మంజ్రేకర్ పై బీసీసీఐ వేటు...

అయితే ఈ వార్తలపై మంజ్రేకర్ స్వయంగా స్పందించాడు. తనను బీసీసీఐ తొలగించిన విషయం వాస్తవమేనని తన వ్యాఖ్యల ద్వారా వెల్లడించాడు. దీనిపై ట్విట్టర్‌లో స్పందించిన మంజ్రేకర్.. బీసీసీఐ నిర్ణయాన్ని పక్కా ప్రొఫెషనల్‌గా అంగీకరిస్తున్నానని తెలిపాడు.

'కామెంట్రీని నా అర్హతగా, నాకు దక్కిన గౌరవంగా భావించాను. అదో ఉపాధి అవకాశం అని ఎప్పుడూ అనుకోలేదు. నన్ను కొనసాగించాలో, వద్దో అనేది నన్ను నియమించుకున్న సంస్థకు చెందిన విషయం. వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను గౌరవిస్తాను. ఒకవేళ నా పనితీరు బీసీసీఐకి నచ్చలేదేమో. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ప్రొఫెషనల్ గా నేను వారు తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను’ అంటూ మంజ్రేకర్ ట్వీట్ చేశారు.

కాగా... ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే.. గతంలో రవీంద్ర జడేజా, హర్షా బోగ్లే విషయంలో మంజ్రేకర్ వ్యవహరించిన తీరువల్లే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందనే కామెంట్స్ వినపడుతున్నాయి. మరి దీనిపై బీసీసీఐ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి. 

click me!