లెస్బియన్ జంటకి ఆడబిడ్డ... తండ్రైన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ మెగన్ స్కాట్...

Published : Aug 21, 2021, 12:12 PM ISTUpdated : Aug 21, 2021, 12:16 PM IST
లెస్బియన్ జంటకి ఆడబిడ్డ... తండ్రైన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ మెగన్ స్కాట్...

సారాంశం

 2019లో తన లాంగ్ టర్మ్ పార్టనర్‌ జెస్ హోలెక్‌ను పెళ్లాడిన ఆస్ట్రేలియా వుమెన్ టీమ్ పేసర్ మెగన్ స్కాట్... ఆడబిడ్డకు జన్మనిచ్చిన మెగన్ స్కాట్ భార్య...

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ మెగన్ స్కాట్‌ తండ్రి అయ్యింది. ఆమె పార్టనర్ జెస్ హోలెక్‌ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. స్వలింగ సంపర్కురాలైన మెగన్ స్కాట్, 2019లో తన లాంగ్ టర్మ్ పార్టనర్‌ జెస్ హోలెక్‌ను పెళ్లాడింది. ఆస్ట్రేలియా స్వలింగ సంపర్కుల వివాహానికి మద్ధతు తెలిపిన వారిలో మెగన్ స్కాట్ ఒకరు...

తల్లి అయిన తన భార్య జెస్‌కి తోడుగా ఉండేందుకు ఇండియాతో జరిగే సిరీస్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది మెగన్ స్కాట్. ఆగస్టు 17న జన్మించిన చిన్నారికి ‘రిలీ లూయిస్ స్కాట్’ అని పేరు కూడా పెట్టేసిందీ జంట.

‘మా ఈ చిట్టి అద్భుతం ఎమర్జెనీ సి సెక్షన్ ద్వారా ఈ భూమి మీదకు వచ్చింది. 24 వారాల మా నిరీక్షణకు ఫలితం దక్కింది. ఐదు వారాలుగా మేం రాత్రిపగలు తేడా లేకుండా టెన్షన్ పడ్డాం. ఇప్పుడు తను బయటికి వచ్చేసింది. ఈ చిట్టిది ఇప్పటికే అనేక లక్ష్యాలను చేధిస్తోంది.. ఈ చిట్టి ప్రాణాన్ని బయటికి తెచ్చేందుకు ఎన్నో కష్టాలను అనుభవించిన నా భార్యను చూసి గర్వపడుతున్నా... ఇలాంటి ఇద్దరు అందమైన అమ్మాయిలు నా జీవితంలో ఉండడం నా అదృష్టం’ అంటూ రాసుకొచ్చింది మెగన్ స్కాట్...

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు