డ్రెస్సింగ్ రూమ్‌లో ఇద్దరు ఆసీస్ ఆటగాళ్ల షాకింగ్ బిహేవియర్

Siva Kodati |  
Published : Mar 24, 2019, 02:19 PM ISTUpdated : Mar 24, 2019, 03:21 PM IST
డ్రెస్సింగ్ రూమ్‌లో ఇద్దరు ఆసీస్ ఆటగాళ్ల షాకింగ్ బిహేవియర్

సారాంశం

క్రమంలో ఆసీస్-పాక్ వన్డే సందర్భంగా ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్ల వికృత ప్రవర్తన క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది

నోటి దురుసుకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు. మైదానంలోనే కాకుండా, గ్రౌండ్ బయట కూడా కాంట్రవర్సీలు చేసి కెరిర్‌లు నాశనం చేసుకున్న ఆసీస్ క్రికెటర్లు ఎంతో మంది.

ఈ క్రమంలో ఆసీస్-పాక్ వన్డే సందర్భంగా ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్ల వికృత ప్రవర్తన క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారం షార్జాలో జరిగిన తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఐదు వికెట్లు 280 పరుగులు చేసింది.

అనంతరం ఆసీస్ లక్ష్యా ఛేదనకు దిగింది. ఈ క్రమంలో ఆ జట్టు క్రికెటర్లు మార్కస్ స్టోయినిస్, ఆడం జంపాలు డ్రెస్సింగ్ రూమ్ బాల్కనీలో పక్కపక్కనే కూర్చొన్నారు. ఈ సమయంలో ముందుగా జంపా.. స్టోయినిస్ తలపై చేతితో మృదువుగా నిమిరాడు.

ఆ తర్వాత మళ్లీ తన చేతితో స్టోయినిస్ చెంప, చెవిపై నిమురుతుండగా జంపా చేతిని స్టోయినిస్ ముద్దాడాడు. ఈ వికృత చేష్టలు కెమెరా కంటికి చిక్కడంతో అవి వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో ఫించ్, షాన్ మార్ష్ అద్బుత ఆటతీరుతో ఆసీస్ విజయం సాధించింది. 

 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !