Asia Cup 2023: 289 పరుగులకు ఆలౌట్ అయిన ఆఫ్ఘాన్.. 2 పరుగుల తేడాతో గెలిచి, సూపర్ 4 రౌండ్‌కి శ్రీలంక.. మహ్మద్ నబీ రికార్డు హాఫ్ సెంచరీ వృథా..
ఆసియా కప్ 2023 టోర్నీ ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ పోరాడి ఓడింది. సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించాలంటే 37.2 ఓవర్లలో 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా, ఆఫ్ఘాన్ 37.4 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఫలితంగా 2 పరుగుల తేడాతో గెలిచిన శ్రీలంక, బంగ్లాదేశ్‌తో కలిసి... గ్రూప్ బీ నుంచి సూపర్ 4 స్టేజీకి అర్హత సాధించింది.
భారీ లక్ష్యఛేదనలో రెహ్మనుల్లా గుర్భాజ్ 4, ఇబ్రహీం జద్రాన్ 7 పరుగులు, గుల్బాదీన్ నయీబ్ 22 పరుగులు చేసి అవుట్ కావడంతో 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆఫ్ఘాన్. ఈ దశలో రెహ్మత్ షా 40 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 పరుగులు, కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ 66 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 59 పరుగులు చేసి ఆఫ్ఘాన్‌ని ఆదుకున్నారు..
THE FASTEST 50 FOR AFGHANISTAN IN ODIs 🤯 played an absolute blinder! Do you think can get to the target in 37.1 overs to qualify for the Super Four? 🤔
Tune-in to , LIVE NOW on Star Sports Network pic.twitter.com/DyfXhJBsXE
undefined
మహ్మద్ నబీ 24 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి, ఆఫ్ఘాన్ తరుపున ఫాస్టెస్ట్ వన్డే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇంతకుముందు పాకిస్తాన్‌పై ముజీబ్ వుర్ రహీం 26 బంతుల్లో హాఫ్ సెంచరీ చేస్తే, నబీ ఆ రికార్డుని బ్రేక్ చేశాడు..
32 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 65 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న మహ్మద్ నబీ, మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అయితే అప్పటికి ఆఫ్ఘాన్, సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించాలంటే 61 బంతుల్లో 91 పరుగులు అవసరమయ్యాయి..
13 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 22 పరుగులు చేసిన కరీం జనత్, వెల్లలాగే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అదే ఓవర్‌లో ఆఫ్ఘాన్ కెప్టెన్ షాహిదీని కూడా అవుట్ చేశాడు వెల్లలాగే. అయితే రషీద్ ఖాన్, నజీబుల్లా జద్రాన్ కలిసి బౌండరీలు బాదుతూ టీమ్‌ని లక్ష్యం వైపు నడిపించారు..
ఆఫ్ఘాన్ సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించాలంటే 10 బంతుల్లో 16 పరుగులు కావాల్సిన సమయంలో నజీబుల్లా అవుట్ అయ్యాడు. 15 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 23 పరుగులు చేసిన నజీబుల్లా, రంజిత బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు..
నజీబుల్లా అవుటైన తర్వాత 3 బంతుల్లో ఒక్క పరుగు అది కూడా ఎక్స్‌ట్రా రూపంలో వచ్చింది. ఆ తర్వాతి ఓవర్‌లో రషీద్ ఖాన్ 3 ఫోర్లు బాది 12 పరుగులు రాబట్టాడు. 38వ ఓవర్ మొదటి బంతికి ఆఫ్ఘాన్‌కి 3 పరుగులు కావాల్సి వచ్చాయి. ఆ బంతికి ముజీబ్ భారీ షాట్‌కి ప్రయత్నించి, బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
ఫజల్ హక్ ఫరూక్ 3 బంతులాడి ధనంజయ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడతో ఆఫ్ఘాన్ ఇన్నింగ్స్‌కి తెరపడింది. 16 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసిన రషీద్ ఖాన్ నాటౌట్‌గా నిలిచాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేయగలిగింది..
పథుమ్ నిశ్శంక 40 బంతుల్లో 6 ఫోర్లతో 41 పరుగులు చేయగా దిముత్ కరుణరత్నే 35 బంతుల్లో 6 ఫోర్లతో 32 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కి 63 పరుగులు జోడించారు. సదీర సమరవిక్రమ 3 పరుగులకే అవుట్ అయినా కుసాల్ మెండిస్ 84 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. సెంచరీకి 8 పరుగుల దూరంలో కుసాల్ మెండీస్ రనౌట్ అయ్యాడు..
చరిత్ అసలంక 43 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 36 పరుగులు చేయగా ధనుంజయ డి సిల్వ 19 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేశాడు. కెప్టెన్ దస్సున్ శనక 5 పరుగులు చేసి అవుట్ కాగా దునిత్ వెల్లలాగే 39 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు మహీశ్ తీక్షణ 24 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేశారు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు 25+ స్కోర్లు చేశారు..
ఆఫ్ఘాన్ బౌలర్ గుల్బాదిన్ నయీబ్ 10 ఓవర్లలో 60 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా రషీద్ ఖాన్‌కి 2 వికెట్లు దక్కాయి. ముజీబ్ వుర్ రహీమ్ ఓ వికెట్ తీశాడు.