ఆసియా కప్ టోర్నమెంటు సూపర్ ఫోర్ లో భాగంగా జరిగిన మ్యాచులో బంగ్లాదేశ్ మీద భారత్ ఓడిపోవడంపై శుభ్ మన్ గిల్ స్పందించాడు. తాను అలా దూకుడుగా ఆడాల్సింది కాదని గిల్ అన్నాడు.
తాను ఇన్నింగ్స్ ను చివరలో మామూలుగా కొనసాగించి వుంటే తాము బంగ్లాదేశ్ మీద విజయం సాధించి ఉండేవాళ్లమని భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శుభ్ మన్ గిల్ అన్నాడు. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా బంగ్లాదేశ్ మీద జరిగిన మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది. శుభ్ మన్ గిల్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. భారత్ అప్పటికే ఫైనల్ కు చేరుకుంది. కానీ బంగ్లాదేశ్ మీద అపజయాన్ని మూట గట్టుకుంది. దానిపై శుభ్ మన్ గిల్ స్పందించాడు.
తాను బంతిని సరిగా అంచనా వేయలేక అవుట్ అయ్యానని ఆయన అన్యనాడు. తన లెక్క తప్పిందని, ఆ సమయంలో తాను దూకుడుగా కాకుండా కాస్తా సాధారణంగా ఆడి వుంటే ఫలితం సానుకూలంగా వచ్చి ఉండేదని ఆయన అన్నాడు. ఇలాంటి విషయాలే తాము నేర్చుకునేవని, కొన్ని సార్లు మనం పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోలేమని ఆయన అన్నాడు. తాను కూడా అలాగే పొరబడ్డానని గిల్ చెప్పాడు.
undefined
పిచ్ స్లోగా ఉందని, బంతి టర్న్ అవుతోందని, సింగిల్స్ తీయడం కూడా కష్టంగా మారిందని అన్నాడు. మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ను ఆయన ప్రశంసించాడు. మ్యాచ్ షకీబ్ తమ నుంచి లాగేసుకున్నాడని అన్నాడు. సూపర్ ఫోర్ లోకి అడుగు పెట్టినప్పటికీ బంగ్లాదేశ్ ఫైనల్ కు చేరుకోవడంలో చాలా వెనకబడిపోయింది.
భారత్ కీలకమైన ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చింది. విరాట్ కోహ్లీ, సిరాజ్, కుల్దీప్ యాదవ్ తదితరులకు విశ్రాంతి ఇచ్చి సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లకు తుది జట్టులో అవకాశం కల్పించింది. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఘోరంగా విఫలమయ్యారు.