వన్డే ప్రపంచ కప్ టోర్నమెంటు సమీపిస్తున్న తరుణంలో పాకిస్తాన్ జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆసియా కప్ మధ్యలోనే వైదొలిగిన పాక్ పేసర్ నసీమ్ షా ప్రపంచ కప్ పోటీలకు అందుబాటులో ఉండడం అనుమానంగానే తోస్తోంది.
వన్డే ప్రపంచ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. పాకిస్తాన్ బౌలింగ్ సంచలనం నసీమ్ షా వన్డే ప్రపంచ కప్ పోటీలకు దూరమవుతున్నాడు. ప్రపంచ కప్ పోటీలకే కాకుండా తదుపరి జరిగే సిరీస్ లు కూడా అతను ఆడకపోవచ్చు. నసీమ్ కుడి భుజానికి తీవ్రమైన గాయమైంది. దుబాయ్ లో ఆయన గాయానికి స్కానింగ్ జరిగితంది. తొలుత భావించిన దాని కన్నా గాయం తీవ్రంగా ఉన్నట్లు స్కానింగ్ లో తేలింది.
షాహిన్ షా అఫ్రిదీ, హరీస్ రౌఫ్ లతో పాటు నసీమ్ షా పాకిస్తాన్ పేస్ బౌలింగులో కీలకమైన ఆటగాడు. ఆసియా కప్ లో భాగంగా గత వారం ఇండియాపై మ్యాచ్ జరుగుతున్న సమయంలో నసీమ్ షా మైదానం వీడి బయటకు వెళ్లాడు. కుడి భుజానికి అయిన గాయం కారణంగా అతను ఆసియా కప్ మధ్యలోనే జట్టు నుంచి వైదొలిగాడు.
undefined
ప్రపంచ కప్ కు మాత్రమే కాకుండా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ కు, పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్ఎల్)కు నసీమ్ షా దూరమయ్యే పరిస్థితి ఉంది. నిలకడగా రాణిస్తున్న నసీమ్ షా జట్టుకు దూరం కావడం పాకిస్తాన్ కు ఎదురులేని దెబ్బనే. నసీమ్ షా గాయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) సెకండ్ ఒపీనియన్ కోరింది. సెకండరీ స్కాన్ తర్వాతనే నసీమ్ షా ప్రపంచ కప్ టోర్నమెంటుకు, తదుపరి సిరీస్ లకు అందుబాటులో ఉంటాడా, లేదని స్పష్టమవుతుంది. ఈలోగా నసీమ్ షా స్థానాన్ని భర్తీ చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నించాల్సి ఉంటుంది.
నసీమ్ షా స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనేది కాస్తా కష్టమైన పనే. ఇటీవలి కాలంలో రాణిస్తున్న జమాన్ ఖాన్ లేదా, మొహమ్మద్ హస్నైన్ పేర్లు వినిపిస్తున్నాయి. గాయం కారణంగా మొహమ్మద్ హస్నైన్ జట్టుకు దూరమయ్యాడు.