ఇండియాపై ఆసియా కప్ ఫైనల్: శ్రీలంకకు భారీ షాక్

By Pratap Reddy Kasula  |  First Published Sep 16, 2023, 4:38 PM IST

ఆసియా కప్ పోటీల్లో భాగంగా ఆదివారం భారత్ మీద జరిగే ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో శ్రీలంకకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. శ్రీలంక స్టార్ స్పిన్నర్ మహీష్ తీక్షణ గాయం కారణంగా మ్యాచుకు దూరమయ్యాడు.


ఆసియా కప్ ఫైనల్ లో భారత్ పై తలపడాల్సిన స్థితిలో శ్రీలంక జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. గాయం కారణంగా శ్రీలంక స్టార్ స్పిన్నర్ మహీష్ తీక్షణ జట్టుకు దూరమయ్యాడు. తీక్షణ భారత్ తో ఆదివారం జరిగే ఆసియా కప్ పైనల్ మ్యాచులో ఆడడం లేదు. అయితే, వన్డే ప్రపంచ కప్ జట్టులో మాత్రం ఉంటాడని తెలుస్తోంది 

గురువారం పాకిస్తాన్ పై జరిగిన మ్యాచులో తీక్షణ గాయపడ్డాడు. పాకిస్తాన్ మీద రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి శ్రీలంక ఫైనల్ కు చేరుకుంది. పాకిస్తాన్ మీద జరిగిన మ్యాచులో గాయపడిన తీక్షణ ఆసియా కప్ ఫైనల్ మ్యాచుకు అందుబాటులో ఉండడని ఎసిసి ఓ ప్రకటనలో తెలిపింది. 

Latest Videos

undefined

శ్రీలంక బౌలింగ్ చేస్తున్న సమయంలో తీక్షణ పలుమార్లు మైదానం నుంచి బయటకు వెళ్లాడు. గాయంతో బాధపడుతూనే అతను 9 ఓవర్లను పూర్తి చేసుకున్నాడు. తీక్షణ ఫైనల్ మ్యాచుకు దూరం కావడం శ్రీలంకను ఇబ్బంది పెట్టేదే. ఇప్పటికే వాళ్లు వానిందు హసరంగ, దుష్మంత చమీర, లాహిరు ముధుశంక, లాహిరు కుమార లేకుండా ఆసియా కప్ టోర్నమెంటులోకి దిగారు. 

తీక్షణ స్థానంలో సాహన్ అరచ్చిగే జట్టులోకి రానున్నాడు. వన్దేల్లో శ్రీలంక తరఫున 2023లో అత్యధిక వికెట్లు తీసిన బౌలరు తీక్షణ.  అతను 15 మ్యాచుల్లో 31 వికెట్లు తీశాడు. ఫిట్నెస్ సాధిస్తే వన్డే ప్రపంచ కప్ పోటీల్లో శ్రీలంకకు అత్యంత కీలకమైన ఆటగాడు అవుతాడు. ప్రపంచ కప్ టోర్నమెంటుకు అన్ని దేశఆాలు సెప్టెంబర్ 28వ తేదీలోగా జట్లను ప్రకటించాల్సి ఉంది. 

ప్రపంచ కప్ పోటీల్లో శ్రీలంక బంగ్లాదేశ్ మీద సెప్టెంబర్ 29వ తేదీన, ఆఫ్గనిస్తాన్ మీద అక్టోబర్ 3వ తేదీన వార్మప్ మ్యాచులు ఆడుతుంది. శ్రీలంక తొలి మ్యాచ్ అక్టోబర్ 7వ తేదీన దక్షిణాఫ్రికాపై ఉంటుంది.

click me!