Asia Cup: హాంకాంగ్ అట్టర్ ప్లాఫ్.. సూపర్-4కు పాకిస్తాన్.. టీమిండియా ఫ్యాన్స్‌కు ఆదివారం మళ్లీ పండుగే..

Published : Sep 02, 2022, 10:27 PM IST
Asia Cup: హాంకాంగ్ అట్టర్ ప్లాఫ్.. సూపర్-4కు పాకిస్తాన్.. టీమిండియా ఫ్యాన్స్‌కు ఆదివారం మళ్లీ పండుగే..

సారాంశం

Asia Cup 2022: ఈ విజయంతో పాకిస్తాన్ సూపర్-4కు అర్హత సాధించింది. గ్రూప్-బి నుంచి ఇప్పటికే భారత్.. రెండు విజయాలతో  సూపర్-4 లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. భారత్ - పాక్ మధ్య మళ్లీ ఆదివారం మ్యాచ్ చూడొచ్చు.

ఆసియా కప్-2022లో తాము ఆడిన తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిన పాకిస్తాన్.. రెండో మ్యాచ్ లో పసికూన హాంకాంగ్ పై రెచ్చిపోయింది.  తొలుత బ్యాటింగ్ చేసి ఆ జట్టుపై భారీ స్కోరు సాధించిన పాక్.. ఆ తర్వాత బౌలింగ్ లోనూ హాంకాంగ్ కు చుక్కలు చూపించింది. పటిష్టమైన బౌలింగ్ లైనప్ కలిగిన పాకిస్తాన్ బౌలర్లను  ఎదుర్కోవడం అనుభవం లేని హాంకాంగ్ బ్యాటర్ల వల్ల కాలేదు. దీంతో 194 పరుగుల లక్ష్య ఛేదనలో హాంకాంగ్.. 10.3 ఓవర్లలో 38 కే ఆలౌటైంది.  ఫలితంగా 155 పరుగుల భారీ తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సొంతం చేసుకుంది. 

హాంకాంగ్ జట్టులో ఒక్క బ్యాటర్ కూడా రెండంకెల స్కోరు చేయకపోవడం గమనార్హం. కెప్టెన్ నిజకత్ ఖాన్.. 8 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇండియాతో మ్యాచ్ లో కాస్త ప్రతిఘటించిన హాంకాంగ్ బ్యాటర్లు.. ఈ మ్యాచ్ లో మాత్రం పూర్తిగా చేతులెత్తేశారు. 

ఈ విజయంతో పాకిస్తాన్ సూపర్-4కు అర్హత సాధించింది. గ్రూప్-బి నుంచి ఇప్పటికే భారత్.. రెండు విజయాలతో  సూపర్-4 లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.  తాజాగా పాక్ కూడా చేరింది. దీంతో ఈ రెండు జట్ల మధ్య మరో రసవత్తర పోరు ఆదివారం (సెప్టెంబర్ 4న) జరగనుంది. 

భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ ఏమాత్రం లక్ష్యం దిశగా సాగలేదు.  నసీమ్ షా వేసిన మూడో ఓవర్లో ఆ జట్టు కెప్టెన్ నిజకత్ ఖాన్ (8) అసిఫ్ అలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అదే ఓవర్లో హయత్ (0) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పట్నుంచి హాంకాంగ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూనే ఉంది. 

ఐదో ఓవర్ వేసిన దహానీ.. ఆ ఓవర్లో ఐదో బంతికి యాసిమ్ ముర్తజా (2) ను పెవిలియన్ కు పంపాడు. ఐజజ్ ఖాన్ (1) నుు షాదాబ్ ఖాన్ బౌల్డ్ చేశాడు. కించిత్ షా (6) ను  మహ్మద్ నవాజ్ ఎనిమిదో ఓవర్ మూడో బంతికి బోల్తా కొట్టించాడు. అదే ఓవర్లో నవాజ్.. వికెట్ కీపర్ స్కాట్ మెక్‌కెచిని (4) ని బౌల్డ్ చేసి  హాంకాంగ్ ను మరింత దెబ్బతీశాడు. 

9వ ఓవర్ వేసిన షాదాబ్ ఖాన్.. చ ఆ ఓవర్లో చివరి బంతికి  హరూన్ అర్షద్ (3) ను బౌల్డ్ చేశాడు. పదో ఓవర్ వేసిన మహ్మద్ నవాజ్.. జీషన్ అలీ (3) ని పెవిలియన్ కు పంపాడు.  డ్రింక్స్ తర్వాత 11వ ఓవర్ వేసిన షాదాబ్ ఖాన్.. తొలి బంతికే అయుష్ శుక్లా (1) ను  ఔట్ చేశాడు. ఘజన్ఫర్  (0) ను ఔట్ చేసి  షాదాబ్.. నాలుగో వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

పాకిస్తాన్ బౌలర్లలో నసీమ్ షా  హాంకాంగ్ ను తొలి దెబ్బ తీయగా స్పిన్నర్లు  మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ లు ఆ జట్టు కోలుకోనీయకుండా చేశారు. షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. నవాజ్ మూడు వికెట్లు తీశాడు. నసీమ్ షా రెండు వికెట్లు పడగొట్టగా దహానీకి ఒక వికెట్ దక్కింది. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్ మూడో ఓవర్లోనే  ఆ జట్టు ప్రధాన బ్యాటర్  బాబర్ ఆజమ్ (9) వికెట్ ను కోల్పోయింది. కానీ వన్ డౌన్ లో క్రీజులోకి వచ్చిన ఫకర్ జమాన్ (53) తో కలిసి మహ్మద్ రిజ్వాన్ (73 నాటౌట్) రాణించారు. చివర్లో ఖుష్దిల్ (35 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో  2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?