Asia Cup: ఫలించిన రోహిత్ వ్యూహం..పారిన పాండ్యా పాచిక.. ఐదో వికెట్ కోల్పోయిన పాక్..

Published : Aug 28, 2022, 08:59 PM IST
Asia Cup: ఫలించిన రోహిత్ వ్యూహం..పారిన పాండ్యా పాచిక.. ఐదో వికెట్ కోల్పోయిన పాక్..

సారాంశం

India Vs Pakistan: భారత్-పాకిస్తాన్ మధ్య  దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో పాక్ 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా పాక్ ను కోలుకోలేని దెబ్బ తీశాడు.

ఆసియా కప్-2022లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న  కీలక మ్యాచ్ లో పవర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ కు హార్ధిక్ పాండ్యా మరో షాకిచ్చాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో అతడు.. ధాటిగా ఆడుతున్న ఇఫ్తికర్ అహ్మద్ (22 బంతుల్లో 28, 2 ఫోర్లు, 1 సిక్స్) ను బోల్తా కొట్టించాడు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్ ను అలవోకగా ఎదుర్కున్న అతడు.. పాండ్యా బౌలింగ్ లో  షాట్ బంతికి పెవిలియన్ కు చేరాడు.  ఆ తర్వాత ఓవర్లో హార్ధిక్.. పాక్ కు మరో భారీ షాకిచ్చాడు. పాకిస్తాన్ భారీ ఆశలు పెట్టుకున్న మహ్మద్ రిజ్వాన్ (42 బంతుల్లో 43, 3 ఫోర్లు, 1 సిక్సర్) ను కూడా పాండ్యా ఔట్ చేశాడు. 

పవర్ ప్లే లో వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో క్రీజులోకి వచ్చిన ఇఫ్తికర్.. రెండు ఫోరలు, ఓ సిక్సర్ తో జోరుమీద కనిపించాడు. చాహల్ వేసిన 12వ ఓవర్లో అతడు భారీ సిక్సర్ బాది   గేర్ మార్చేందుకు యత్నించాడు.  అయితే ఆ తర్వాత బంతికే అతడు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు. 

కానీ రోహిత్ శర్మ అతడిని ఔట్ చేసేందుకు హార్ధిక్ కు బంతినిచ్చాడు. 13వ ఓవర్ వేసిన హార్ధిక్.. తొలి బంతికే ఇఫ్తికర్ ను బోల్తా కొట్టించాడు. అతడు వేసిన షాట్ బంతిని ఆడబోయి వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కు క్యాచ్ ఇచ్చాడు.

ఆ తర్వాత ఓవర్లో  పాండ్యా.. తొలి బంతికే రిజ్వాన్ నూ ఔట్ చేసి పాక్ కు కోలుకోలేని షాకిచ్చాడు. పాండ్యా వేసిన 15వ ఓవర్ తొలి బంతికి రిజ్వాన్.. అవేశ్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అదే ఓవర్లో పాండ్యా.. ఖుష్దిల్ (2) ను ఔట్ చేశాడు. 

 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్.. గతేడాది టీ20 ప్రపంచకప్  మాదిరిగానే ధాటిగా ఆడుతుందని భావించినా భువనేశ్వర్ ముందు ఆ జట్టు పప్పులుడకలేదు. తొలి ఓవర్లోనే కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన భువీ.. తన రెండో ఓవర్లో నాలుగో బంతికి బాబర్ ఆజమ్ ను పెవిలియన్ కు పంపాడు. భువీ బౌలింగ్ లో వేసిన షాట్ బంతిని బాబర్ భారీ షాట్ కు యత్నించగా.. అది కాస్తా టాప్ ఎడ్జ్ కు తాకి అర్ష్‌దీప్ సింగ్ చేతుల్లో పడింది. దీంతో పాకిస్తాన్ 15 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన ఫకర్ జమాన్.. రెండు ఫోర్లు కొట్టి  జోరుమీద కనిపించినా అవేశ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో అతడు దినేశ్ కార్తీక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

15 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్..  5 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది