క్రికెట్ అభిమానులకు షాక్.. ఆసియా కప్ లేనట్లే: ప్రకటించిన గంగూలీ

By Siva KodatiFirst Published Jul 8, 2020, 9:48 PM IST
Highlights

ఆసియా కప్-2020 రద్దైందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు. జూలై 9న ఆసియా క్రికెట్ మండలి సమావేశం జరగడానికి ముందే దాదా ఈ విషయం వెల్లడించడం విశేషం

కరోనా వైరస్ కారణంగా క్రీడా రంగం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే వివిధ క్రీడలు వాయిదా పడటమో, రద్దవ్వడమో జరిగాయి. క్రికెట్ సైతం దీనికి అతీతం కాదు. తాజాగా మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్ దాదాపుగా రద్దయినట్టే.

ఆసియా కప్-2020 రద్దైందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు. జూలై 9న ఆసియా క్రికెట్ మండలి సమావేశం జరగడానికి ముందే దాదా ఈ విషయం వెల్లడించడం విశేషం.

అయితే ఈ నిర్ణయాన్ని ఆసియా క్రికెట్ మండలి తీసుకుందా లేదా అన్నది గంగూలీ వివరించలేదు. టీమిండియా తొలి అంతర్జాతీయ సీరిస్ ఎప్పుడు ఆడుతుందో ఇప్పుడే చెప్పడం కష్టమన్న ఆయన.. తమ సన్నద్దత మాత్రం కొనసాగుతుందని వెల్లడించారు.

అయితే ప్రభుత్వ నిబంధనలు తెలిసేదాకా ఏమీ చేయలేం.. ఆటగాళ్ల ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి తాము దేనికి తొండరపడటం లేదని గంగూలీ చెప్పారు. నెలవారీగా అన్నిటినీ పర్యవేక్షిస్తున్నామని దాదా ఇన్‌‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

కాగా షెడ్యూల్ ప్రకారం.. ఆసియా కప్‌కు పాకిస్తాన్ వాయిదా ఇవ్వాలి.. అయితే దాయాది దేశానికి వెళ్లేందుకు బీసీసీఐ ఇష్టపడకపోవడంతో వేదిక దుబాయ్‌కి మారింది. సెప్టెంబర్‌లో టోర్నీ నిర్వహించాల్సి వుంది.

అయితే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో రద్దయినట్లుగా తెలుస్తోంది. ఇక ఐసీసీ టీ 20 ప్రపంచకప్ సైతం వాయిదాపడితే ఐపీఎల్ 2020 నిర్వహించుకునేందుకు పూర్తి స్థాయిలో విండో దొరుకుతుందని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి. 

click me!