ఓ వరుణా రేపురా..! ఆసక్తికర ముగింపుకు వర్షం అడ్డంకి.. ఇంగ్లాండ్-ఆసీస్ తొలి టెస్టు ఏమయ్యేనో..!

Published : Jun 20, 2023, 04:11 PM IST
ఓ వరుణా రేపురా..!  ఆసక్తికర ముగింపుకు వర్షం అడ్డంకి.. ఇంగ్లాండ్-ఆసీస్ తొలి టెస్టు ఏమయ్యేనో..!

సారాంశం

Ashes 2023:ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు  ఐదో రోజు ఆసక్తికర ఫలితం తేలనుందని అభిమానుల భావిస్తుంటే వారి ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. 

ఆస్ట్రేలియా విజయానికి  90 ఓవర్లలో 174 పరుగులు కావాలి.  ఇంగ్లాండ్ గెలవాలంటే అన్నే ఓవర్లలో ఏడు వికెట్లు తీయాలి.  వేదిక ఎడ్జ్‌బాస్టన్. ఇరు  జట్లు జోరుమీదున్నాయి. ఆధిక్యం ఇరు జట్ల మధ్య దోబూచూలాడుతూనే ఉంది. విజయావకాశాలు రెండు జట్లకూ సమానంగా ఉన్నాయి.  టెస్టు, వన్డే తరహా ఆట ఆడే ఆటగాళ్లు, భీకర బౌలర్లు  రెడీగా ఉన్నా ఈ ఆసక్తికర  ముగింపునకు   ఎవరూ ఊహించని విధంగా వరుణుడు కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. ఎడ్జ్‌బాస్టన్ లో  ఈ రోజు జరాగాల్సిన ఆఖరి రోజు ఆటకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. 

ఆట ఆఖరి రోజు  ఇరు జట్లనూ విజయం ఊరిస్తున్న వేళ ఈ ఉత్కంఠను మరింత పెంచుతూ  వరుణుడు  బర్మింగ్‌హోమ్ లో నేటి ఉదయం నుంచి  తన ప్రతాపాన్ని చూపతున్నాడు.  

మధ్యలో కొంతసేపు  వర్షం తగ్గినా మ్యాచ్  ప్రారంభానికి ముందు  మళ్లీ వర్షం  మొదలవడంతో  ఆటగాళ్లు ఎవరూ బయటకు రాలేదు.  ఆకాశం మేఘావృతమై ఉండటం..  వర్షం కూడా  తన ప్రతాపాన్ని చూపుతుండటంతో  ఇప్పటికైతే ఫస్ట్ సెషన్  వాష్ అవుట్ అయినట్టేనని తెలుస్తున్నది. స్థానిక కాలమానం (బర్మింగ్‌హోమ్)  ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే మ్యాచ్ ఆరంభమయ్యే (అంటే లంచ్ తర్వాత)  అవకాశమున్నట్టు తెలుస్తున్నది.  రెండు గంటల పాటు ఆట అయితే   సాధ్యం కాదని  సమాచారం.   

 

మరి రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య నాలుగు రోజుల పాటు ఆసక్తికరంగా సాగిన  టెస్టు  మ్యాచ్ కు ముగింపు దక్కుతుందా..? లేక వరుణుడు  ఇరు జట్లకు సమన్యాయం చేస్తాడా..? అన్నది తేలాల్సి ఉంది.  

ఎడ్జ్‌బాస్టన్ టెస్టు  విషయానికొస్తే.. ఇంగ్లాండ్  రెండో ఇన్నింగ్స్  లో 273 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 7 పరుగుల నామమాత్రపు ఆధిక్యంతో కలిపి ఆ జట్టు ఆసీస్ ముందు 280 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.   నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్.. 30 ఓవర్లలో  107 పరుగులు చేసింది.  ఉస్మాన్ ఖవాజా (34 నాటౌట్),  నైట్ వాచ్‌మెన్ స్కాట్ బొలాండ్ (13 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. ఆసీస్ విజయానికి ఆఖరి రోజు 174 పరుగులు కావాలి.  ఇంగ్లాండ్  కు ఏడు వికెట్లు పడగొడితే విజయం ఆ జట్టు సొంతమవుతుంది. 

సంక్షిప్త స్కోరు వివరాలు :  

ఇంగ్లాండ్ : ఫస్ట్ ఇన్నింగ్స్ లో 393-8
ఆస్ట్రేలియా : ఫస్ట్ ఇన్నింగ్స్ 386 ఆలౌట్ 
ఇంగ్లాండ్ : రెండో ఇన్నింగ్స్ : 273 ఆలౌట్ 
ఆస్ట్రేలియా : రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి   107-3 

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026 : పాకిస్థాన్ తప్పుకుంటే మళ్లీ బంగ్లాదేశ్ ఎంట్రీ? వరల్డ్ కప్‌లో సంచలన ట్విస్ట్ !
ఆ సినిమాలో హీరో నేనే అంటే.. నిర్మాత చేయనన్నాడు.. ధనరాజ్