మీ దూకుడు సాటెవ్వడు.. రూట్ సెంచరీ.. తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన బెన్ స్టోక్స్

Published : Jun 17, 2023, 09:26 AM IST
మీ దూకుడు సాటెవ్వడు..  రూట్ సెంచరీ.. తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన  బెన్ స్టోక్స్

సారాంశం

Ashes 2023: యాషెస్ సిరీస్ ఘనంగా  ఆరంభమైంది. ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా  మధ్య ఎడ్జ్‌‌బాస్టన్ వేదికగా  జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లీష్ జట్టు తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం గమనార్హం. 

గడిచిన ఏడాదికాలంగా ‘బజ్‌బాల్’ ఆటతో   టెస్టులు ఆడే విధానాన్నే మార్చేస్తున్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు.. దూకుడుకు మారుపేరైన  ఆస్ట్రేలియాతో  శుక్రవారం  ప్రారంభమైన యాషెస్ ను ఘనంగా ఆరంభించింది. ఈ రెండు జట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో  మొదటి రోజు  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న  ఇంగ్లాండ్.. 78 ఓవర్లు ఆడి మరో రెండు వికెట్లు చేతిలో ఉండగానే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. 8 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసిన ఇంగ్లాండ్  డిక్లేర్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.  ఇంగ్లాండ్ మాజీ సారథి  జో రూట్ సెంచరీతో రాణించాడు. 

తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్‌.. 22 పరుగుల వద్దే తొలి వికెట్ ను కోల్పోయింది.  బెన్ డకెట్ (12) విఫలమయ్యాడు. కానీ మరో ఓపెనర్ జాక్ క్రాలే  (61) మాత్రం  వన్డే తరహాలో ఆడాడు. ఓలీ పోప్ (31) తో కలిసి రెండో వికెట్ కు 70 పరుగులు జోడించిన క్రాలే.. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. 

అయితే లంచ్ విరామానికి ముందు ఇంగ్లాండ్ క్రాలేతో పాటు పోప్ వికెట్లను కోల్పోయింది.  ఈ క్రమంలో జో రూట్.. (152 బంతుల్లో  118 నాటౌట్, 7 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యాతయుత ఇన్నింగ్స్ ఆడాడు.  హ్యారీ బ్రూక్ (32) దురదృష్టవశాత్తూ  ఔట్ అయినా   ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్ (1) కూడా నిరాశపరిచాడు.   కానీ  జానీ బెయిర్ స్టో వచ్చాక  పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆసీస్ బౌలింగ్ కు కౌంటర్ ఎటాక్ ఇచ్చిన బెయిర్ స్టో.. 78 బంతుల్లో 78 పరుగులు చేసి  నిష్క్రమించాడు. రూట్ - బెయిర్ స్టో  లు ఆరో వికెట్ కు 121 పరుగులు జోడించారు. బెయిర్ స్టో ఔటయ్యాక మోయిన్ అలీ (18) కూడా ఎక్కువసేపు నిలువలేకపోయాడు.  అదే క్రమంలో 90లలోకి వచ్చిన రూట్ నెమ్మదించాడు.  అలీ నిష్క్రమించినా  స్టోక్స్ సాయంతో  రూట్ ఇంగ్లాండ్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.  ఇదే క్రమంలో 145 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.  

 

రూట్  సెంచరీ అయ్యాక  కొద్దిసేపటికే బెన్ స్టోక్స్  ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు.  అప్పటికీ ఇంకా రెండు వికెట్లు చేతిలో ఉన్నా..   రూట్ మంచి టచ్ లో ఉన్నా స్టోక్స్  డిక్లేర్  ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. ఇక తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన ఆసీస్.. 4 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా  14 పరుగులు చేసింది.  డేవిడ్ వార్నర్ (8 నాటౌట్), ఉస్మాన్ ఖవాజా (4 నాటౌట్)   క్రీజులో ఉన్నారు.  ఆసీస్ బౌలర్లలో  నాథన్ లియాన్.. 4 వికెట్లు తీయగా హెజిల్వుడ్  రెండు వికెట్లు పడగొట్టాడు.  బొలాండ్, గ్రీన్ లు తలా ఓ వికెట్ తీశారు.  ఇంగ్లాండ్ బ్యాటర్ల దూకుడుకు ఆసీస్ బౌలర్ల అందరి ఎకానమీ 4 ప్లస్ గానే నమోదు కావడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK : పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన కుర్రాళ్లు ! భారత్ సూపర్ విక్టరీ
వర్తు వర్మ వర్తు.! వీళ్లు సైలెంట్‌గా పెద్ద ప్లానే వేశారుగా.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?