
యాషెస్ సిరీస్ లో భాగంగా Australia లోని సిడ్నీ వేదికగా ఆసీస్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో వర్షం తీవ్ర అంతరాయం సృష్టించింది. తొలి రోజు పలుమార్లు పదే పదే వర్షం కురవడంతో సగం ఓవర్ల ఆట కూడా సాధ్యపడలేదు. 46.5 ఓవర్లు మాత్రమే ఆట సాధ్యమైన తొలి టెస్టులో ఆస్ట్రేలియా.. 3 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఆట ముగిసే సయమానికి England బౌలర్లు విజృంభించడంతో కంగారూలు త్వరత్వరగా మూడు వికెట్లు కోల్పోయారు. ప్రస్తుతం క్రీజులో స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా ఉన్నారు. ఇప్పటికే Ashes సిరీస్ లో ఆసీస్ మూడు టెస్టులు నెగ్గి సిరీస్ కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మిగిలిన రెండు టెస్టుల్లో అయినా నెగ్గి పరువు దక్కించుకోవాలని ఇంగ్లాండ్ ఆరాటపడుతున్నది.
వర్షం హెచ్చరికలతో అనుమానాలతో మొదలైన Sydney Testలో Aussies ఓపెనర్లు శుభారంభం చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన David Warner.. 72 బంతుల్లో 30 పరుగులు చేసి కుదురుకున్నట్టే కనిపించాడు. కానీ Stuart Broad బౌలింగ్ లో క్రాలేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక మరో ఓపెనర్ మార్కస్ హారిస్ కూడా 109 బంతుల్లో 38 పరుగులు చేసి నిష్క్రమించాడు. తొలి వికెట్ కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించిన ఓపెనర్లన బ్రాడ్ విడదీశాడు.
ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇన్ఫామ్ బ్యాటర్ లబూషేన్ తో కలిసి హారిస్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. లబూషేన్-హారిస్ లు కూడా రెండో వికెట్ కు 61 పరుగుల పార్ట్నర్ షిప్ నమోదు చేశారు. కానీ james Anderson వేసిన ఓ బంతిని స్లిప్స్ లో ఉన్న రూట్ కు క్యాచ్ ఇచ్చి హారిస్ ఔటయ్యాడు. అతడు ఔటైన వెంటనే లబూషేన్ (59 బంతుల్లో 28) కూడా మార్క్ వుడ్ కు దొరికిపోయాడు. ఆట ముగుస్తుందనగా.. 40.2 ఓవర్ లో లబూషేన్.. వుడ్ బౌలింగ్ లో కీపర్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
117 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోవడం.. వర్షం, వాతావారణం అనుకూలించడంతో ఇంగ్లాండ్ బౌలర్లు పదునైన బౌలింగ్ తో విరుచుకుపడుతుండటంతో స్మిత్ (6 నాటౌట్), ఖవాజా (4 నాటౌట్) లు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. చివరికి మళ్లీ వర్షం కురవడంతో తొలి రోజు ఆటను రద్దుచేశారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో పేసర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్ లకు తలో వికెట్ దక్కింది.