రాణించకపోయినా ముంబై జట్టులోకి సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్... నెక్ట్స్ ఐపీఎల్‌లోకే...

By team teluguFirst Published Jan 3, 2021, 5:02 PM IST
Highlights

20 ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకోని అర్జున్ టెండూల్కర్..

సచిన్ తనయుడి కోసం జట్టును విస్తరిస్తూ 22 మందితో జాబితాను విడుదల చేసిన ముంబై...

పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వకపోయినా మహ్మద్ అజారుద్దీన్ కొడుక్కి హైదరాబాద్ జట్టులో చోటు దక్కింది. అలాంటిది ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్‌ కొడుకు అర్జున్ టెండూల్కర్‌కి ముంబై జట్టులో ప్లేస్ రావడం పెద్ద కష్టమేమీ కాదుగా... అనుకున్నట్టే ముందుగా ముంబై జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అర్జున్, తండ్రి తోడ్పాటుతో టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశాడు.

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ 2021 కోసం ముంబై తొలుత 20 మంది ప్లేయర్లతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టులో అర్జున్ టెండూల్కర్‌కి ప్లేస్ లేకపోవడంతో అందరూ అవాక్కయ్యారు. అయితే మళ్లీ అర్జున్ టెండూల్కర్‌ను కూడా చేర్చారు.

అతన్ని ఒక్కడినే చేరిస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, మరో ప్లేయర్‌తో కలిపి మొత్తం 22 మందితో జట్టును ప్రకటిస్తున్నట్టు తెలిపింది ముంబై జట్టు. 21 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్... బౌండరీల మోత మోగించాడు.

ఎలాగోలా సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ టెండూల్కర్, వచ్చే సీజన్‌లో ఐపీఎల్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వడం ఖాయం. పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వకపోయినా సచిన్ కొడుకు కాబట్టి ప్రీమియర్‌ లీగ్‌లోకి వచ్చేశాడు అర్జున్ టెండూల్కర్.

click me!