మరోసారి వింటేజ్ సచిన్ ని పరిచయం చేశాడు...!

Published : Sep 23, 2022, 09:36 AM IST
 మరోసారి వింటేజ్ సచిన్ ని పరిచయం చేశాడు...!

సారాంశం

ప్రతి సంవత్సరం సీనియర్స్ అందరూ కలిసి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఆడుతూ ఉంటారు. అందులో సచిన్ కూడా ఆడుతూ ఉంటారు. అయితే.. దీనిలో భాగంగా సోమవారం ఇండియన్ లెజెండ్స్ జట్టు న్యూజిలాండ్ లెజెండ్స్ తో తలపడింది. ఈ మ్యాచ్ లో... సచిన్ సిక్స్ తో అదరగొట్టాడు.

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ స్టేడియంలోకి అడుగుపెడితే.. ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఆటకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన టీమిండియాలో లేకపోయినా... లెజండ్స్ టీమ్ లో ఉన్నారు. ప్రతి సంవత్సరం సీనియర్స్ అందరూ కలిసి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఆడుతూ ఉంటారు. అందులో సచిన్ కూడా ఆడుతూ ఉంటారు. అయితే.. దీనిలో భాగంగా సోమవారం ఇండియన్ లెజెండ్స్ జట్టు న్యూజిలాండ్ లెజెండ్స్ తో తలపడింది. ఈ మ్యాచ్ లో... సచిన్ సిక్స్ తో అదరగొట్టాడు.

ఈ మ్యాచ్ కేవలం 5.5 ఓవర్లు మాత్రమే కొనసాగిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ స్కోర్ 49\1 గా ఉంది. సచిన్ 146 స్ట్రైక్ రేటుతో(19) అజేయంగా క్రీజులో ఉన్నాడు.

 

మ్యాచ్ జరిగిన కొద్దిసేపు సచిన్ తనదైన షాట్లతో అభిమానులను అలరించాడు. సచిన్  ఆటను చూసి అభిమానులు ఆనందంతో గంతులేస్తున్నారు. మరోసారి వింటేజ్ సచిన్ ని చూపించాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. 25ఏళ్ల క్రితం ఎలా అయితే... అదరగొట్టాడో... మళ్లీ అలా ఆడాడు అంటూ.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

న్యూజిలాండ్ బౌలర్ మిల్స్ తొలి ఓవర్ ఐదో బంతికి సచిన్ క్రీజులో కొంచెం వెనక్కి జరిగి కొట్టిన బ్యాక్ ఫుట్ పంచ్ షాటుకు బంతికి బౌండరీ లైన్ దాటిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత ల్యాప్, పుల్, స్కూప్ వంటి షాట్లతో న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సచిన్ సిక్స్ కొట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
 

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?