మేము కూడా ఆయన ఫ్యాన్సే... ధోనీపై అనుష్క శర్మ కామెంట్స్ వైరల్..!

Published : Apr 18, 2023, 09:43 AM IST
మేము కూడా ఆయన ఫ్యాన్సే... ధోనీపై అనుష్క శర్మ కామెంట్స్ వైరల్..!

సారాంశం

ముఖ్యంగా చెన్నైసూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ అంటే... కచ్చితంగా ఈ టాపిక్ తెరపైకి వస్తుంది. ధోనీ గ్రేట్ అని కొందరు...లేదు.. కోహ్లీనే గ్రేట్ అంటూ వాదించుకుంటూ ఉంటారు

ఐపీల్ 2023 హుషారుగా సాగుతోంది. ఈ ఐపీఎల్ లో ప్రతి ఒక్కరూ తమ అభిమాన క్రికెటరే గ్రేట్ అంటే.. మా క్రికెటర్ గ్రేట్ అంటూ ఓ రేంజ్ యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చెన్నైసూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ అంటే... కచ్చితంగా ఈ టాపిక్ తెరపైకి వస్తుంది. ధోనీ గ్రేట్ అని కొందరు...లేదు.. కోహ్లీనే గ్రేట్ అంటూ వాదించుకుంటూ ఉంటారు

 

చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో RCB, CSK తో తలపడినప్పుడు కూడా అదే జరిగింది. ఆర్‌సిబికి బెంగళూరు ప్రేక్షకుల నుండి అత్యధిక మద్దతు లభిస్తుండగా, ధోనీకి కూడా భారీ గౌరవం ఉంది. అందుకే, తొలి ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్‌లో ధోనీ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు... స్టేడియం వద్ద ఉన్న అభిమానులు అతని పేరును జపించారు. ఈ సందర్భంగా  విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ చేసిన కామెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆమె... ఈ సందర్భంగా తాము కూడా ధోనీ ఫ్యాన్స్ అని చెప్పడం విశేషం. తాను మాత్రమే కాదు.... కోహ్లీ కూడా ధోనీని ప్రేమిస్తాడు అంటూ... అనుష్క శర్మ చెప్పిన మాటలు అభిమానులను అలరిస్తున్నాయి.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.... ముందుగా చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 226 పరుగులు చేసింది. ఇంకా రెండు బంతులు ఉన్నాయి అనగా ధోనీ మైదానంలోకి అడుగుపెట్టాడు. కాగా... ఈ మ్యాచ్ లో చెన్నై విజయం సాధించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !