జస్ప్రిత్ బుమ్రాతో అనుపమ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ మదర్... సునీతా పరమేశ్వరన్ ఏమందంటే...

Published : Mar 07, 2021, 10:17 AM IST
జస్ప్రిత్ బుమ్రాతో అనుపమ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ మదర్... సునీతా పరమేశ్వరన్ ఏమందంటే...

సారాంశం

నాలుగో టెస్టు నుంచి తనని తప్పించాలని రిక్వెస్ట్ చేసిన బుమ్రా... త్వరలో బుమ్రా, అనుపమ పరమేశ్వరన్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు... పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన సునీతా పరమేశ్వరన్...

టీ20 సిరీస్‌లో కూడా లేని జస్ప్రిత్ బుమ్రా, నాలుగో టెస్టు నుంచి తనని తప్పించాలని రిక్వెస్ట్ చేయడం, దానికి కారణం అతను పెళ్లి చేసుకోబోతుండడమే అని బీసీసీఐ అధికారి చెప్పడంతో టీమిండియా పేసర్, సౌత్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పెళ్లి చేసుకోబోతున్నారని ఊహాగానాలు రేగాయి.

హాలీడే‌లో ఉన్నానంటూ ప్రకటించిన అనుపమ, రాజ్‌కోట్ వెళ్తున్నానని పోస్టు చేయడం కూడా బుమ్రాతో ఆమె పెళ్లి ఫిక్స్ అని వార్తలు రావడానికి కారణమయ్యాయి. అయితే అనుపమ పరమేశ్వరన్ తల్లి సునీతా పరమేశ్వరన్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

‘జస్ప్రిత్ బుమ్రా, అనుపమ కేవలం ఫ్రెండ్స్ మాత్రమే, వారిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు’ అంటూ స్పష్టం చేసింది సునీత. దీంతో బుమ్రా, అనుపమ వస్తున్న పెళ్లి వార్తలకు ఫుల్‌స్టాప్ పడ్డట్టు అయ్యింది. ప్రస్తుతం స్పోర్ట్స్ రిపోర్టర్ సంజనా గణేశన్‌తో బుమ్రా పెళ్లి జరగబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది
IND vs SA: హార్దిక్ హిట్ షో.. రీఎంట్రీలో సఫారీలకు చుక్కలు ! సిక్సర్ల కింగ్