రెండు బంతుల్లో రెండు వికెట్లు... రవిచంద్రన్ అశ్విన్ మ్యాజిక్... కష్టాల్లో ఇంగ్లాండ్...

Published : Mar 06, 2021, 12:31 PM IST
రెండు బంతుల్లో రెండు వికెట్లు... రవిచంద్రన్ అశ్విన్ మ్యాజిక్... కష్టాల్లో ఇంగ్లాండ్...

సారాంశం

10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన అశ్విన్... అశ్విన్ హ్యాట్రిక్‌ను అడ్డుకున్న జో రూట్...

భారత జట్టుకి 160 పరుగుల తొలి ఇన్నింగ్స్ దక్కిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్ జట్టును, భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తిప్పలు పెట్టాడు. లంచ్ బ్రేక్‌కి ముందు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఓపెనర్లు సిబ్లీ, జాక్ క్రావ్లే కలిసి వికెట్ పడకుండా 6 పరుగులు చేశారు.

అయితే లంచ్ విరామం తర్వాత బంతి తీసుకున్న రవిచంద్రన్ అశ్విన్ వరుసగా రెండు బంతల్లో రెండు వికెట్లు తీశాడు. 5 పరుగులు చేసిన జాక్ క్రావ్లే, అశ్విన్ బౌలింగ్‌లో రహానేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే జానీ బెయిర్ స్టో, అశ్విన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

వరుస రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసిన అశ్విన్‌కి వికెట్ దక్కకుండా అడ్డుకున్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్... 11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు, ఇంకా టీమిండియా స్కోరుకి 149 పరుగుల దూరంలో నిలిచింది. 

PREV
click me!

Recommended Stories

IND vs NZ : ఆ గ్రౌండ్‌లో రోహిత్, కోహ్లీలకు శని పట్టిందా? 17 ఏళ్లుగా తీరని కోరిక !
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ.. టీ20 ప్రపంచకప్ తర్వాత ఆ ముగ్గురు రిటైర్మెంట్ పక్కా.!