విడాకులన్నారు.. కార్లలో తిరుగుతున్నారేంటి..? సానియా-షోయభ్ డైవర్స్ ‌లో కొత్త మలుపు..!

Published : Dec 05, 2022, 06:15 PM IST
విడాకులన్నారు.. కార్లలో తిరుగుతున్నారేంటి..?  సానియా-షోయభ్  డైవర్స్ ‌లో కొత్త మలుపు..!

సారాంశం

Sania - Shoaib divorce: ఇండియన్ టెన్నిస్ స్టార్  సానియా మీర్జా పాకిస్తాన్  క్రికెట్ జట్టు మాజీ సారథి షోయభ్ మాలిక్ ల మధ్య విబేధాలు తలెత్తాయని, ఈ ఇద్దరూ త్వరలోనే విడిపోతున్నారని వార్తలు వెలువడుతున్న తరుణంలో... 

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారని? లేదు, విడాకులు తీసేసుకున్నారని కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పాక్ మోడల్ అయేషా ఓమర్‌తో షోయబ్ మాలిక్ సీక్రెట్ రిలేషన్‌ గురించి సానియా మీర్జాకి తెలియడంతో ఈ ఇద్దరూ విడిపోవాలని డిసైడ్ చేసుకుంటున్నట్టు కథనాలు వినిపించాయి. అయితే  దీనిపై అటు షోయభ్ మాలిక్ గానీ ఇటు  సానియా మీర్జా గానీ అధికారికంగా ఏ  ప్రకటనా  చేయకపోవడంతో ఈ రూమర్స్ నిజమేనన్న వాదనలూ ఉన్నాయి.  

విడాకుల నేపథ్యంలో షోయభ్ మాలిక్ తన ట్విటర్ వేదికగా చేసిన పోస్టు ఆసక్తి రేకెత్తిస్తున్నది. మాలిక్ తన కొడుకు ఇజాన్ తో కలిసి ఖరీదైన లంబూర్ఘిని కారులో షికారు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను  మాలిక్ తన ట్విటర్ లో షేర్ చేశాడు. 

‘గుడ్ ఫాదర్ సన్ టైమ్, లంక ప్రీమియర్ లీగ్ కు వెళ్లేముందు ఇజాన్ తో లాంగ్ డ్రైవ్ కు వెళ్లాను.  ఈ డ్రైవ్ కు ముందు మేం  సీట్ బెల్ట్ లను పెట్టుకున్నాం.  మీరందరూ సీట్ బెల్టులను తప్పకుండా ధరించండి..’ అని   వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చాడు.   అయితే మాలిక్ చేసిన ఈ పోస్టుపై  ట్విటర్ లో నెటిజనులు మాలిక్ ను.. ‘ఇజాన్  ఎక్కువగా సానియాతోనే ఉంటాడు కదా. మరి సానియా ఏది..?’, ‘అదేంటి విడాకులన్నారు..  కలిసే తిరుగుతున్నారు..  ఇవన్నీ టీవీ షోల కోసం చేసిన స్టంట్సేనా..?’ అని కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదిలాఉండగా సానియా మీర్జా- షోయబ్ మాలిక్ కలిసి త్వరలో ఓ టీవీ టాక్ షో నిర్వహించబోతున్నారు. ‘ది మీర్జా మాలిక్ షో’ పేరుతో ఊర్దూఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రకటించింది. ఈ టాక్ షోకి పాపులారిటీ, క్రేజ్ తెచ్చేందుకు మీర్జా మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్‌కి పుట్టించారని వార్తలు వినిపించాయి. తాజాగా  మాలిక్.. ఇజాన్ తో కలిసి లాంగ్ డ్రైవ్ లకు వెళ్లడం.. ఇద్దరి మధ్య విడాకులకు సంబంధించిన  వార్తలకు కూడా ఫుల్ స్టాప్ పడటంతో ఇదంతా టీవీ షో కోసం జిమ్మిక్కేనని స్పష్టమైందని నెటిజనులు వాపోతున్నారు. 

 

టెన్నిస్ కెరీర్ దాదాపుగా ముగియడంతో సానియా మీర్జా ప్రస్తుతం తన కొడుకుతో దుబాయ్ లో గడుపుతోంది.  ఇక పాకిస్తాన్ జట్టులో చోటు కోల్పోయినా మాలిక్ మాత్రం లీగ్ లలో ఆడుతూనే ఉన్నాడు. అతడు రేపటి (డిసెంబర్ 6) నుంచి మొదలుకాబోయే లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) లో గాలె గ్లాడియేటర్స్ తరఫున ఆడబోతున్నాడు. 

నలభై ఏండ్ల మాలిక్.. పాకిస్తాన్ తరఫున  287 వన్డేలు ఆడి 7 వేలకు పైగా  పరుగులు చేశాడు.  124 టీ20లలో 2,435 రన్స్ సాధించాడు. 35 టెస్టులు ఆడి 1,898 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో 12 సెంచరీలు (టీ20లలో లేవు), 61 హాఫ్ సెంచరీలు సాధించాడు. టెస్టులలో 32, వన్డేలలో 158, టీ20లలో 28 వికెట్లు తీశాడు. 
 

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది