వివియస్ లక్ష్మణ్ ఓదార్పు: అంబటి రాయుడి చేతికి కెప్టెన్సీ

By telugu teamFirst Published Sep 14, 2019, 9:21 PM IST
Highlights

వివియస్ లక్ష్మణ్, నోయల్ డేవిడ్ ల ఓదార్పుతో రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న అంబటి రాయుడు హైదరాబాద్ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. రాయుడి నేతృత్వంలో హైదరాబాద్ జట్టు సత్తా చాటే అవకాశాలు లేకపోలేదు.

హైదరాబాద్: తెలుగు క్రికెటర్ అంబటి రాయుడికి హైదరాబాద్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ అప్పగించారు. క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కొన్నాళ్లకే ఆయన యూటర్న్ తీసుకుని తన రిటైర్మెంట్ ప్రకటనను వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. తాను మళ్లీ క్రికెట్ ఆడుతానంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సిఎ) కు రాయుడు లేఖ రాశాడు.

రాయుడి లేఖకు హెచ్ సిఎ పచ్చజెండా ఊపింది. దానికితోడు ఆయనకు హైదరాబాద్ క్రికెట్ జట్టు పగ్గాలను అప్పగిం్చారు. త్వరలో జరిగే విజయ్ హజారే ట్రోఫీకి హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా అంబటి రాయుడిని నియమించినట్లు హెచ్ సిఎ ప్రకటించింది.

రాయుడిని హైదరాబాద్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా నియమించడంపై నోయల్ డేవిడ్ స్పందించాడు. రాయుడికి ఇంకా ఐదేళ్ల క్రికెట్ మిగిలే ఉందని, దురదృష్టవశాత్తు ప్రపంచ కప్ లో ఆడలేకపోయాడని ఆయన అన్నాడు. దాంతో నిరాశ చెందాడని అన్నాడు. తాను, లక్ష్మణ్ రాయుడితో మాట్లాడి ఓదార్చినట్లు తెలిపారు. దాంతో రిటైర్మెంట్ పై రాయుడు వెనక్కి తగ్గినట్లు తెలిపాడు. రాయుడి అనుిభవం యువ క్రికెటర్ల ఉపయోగపడుతుందని, హైదరాబాదుకు కూడా రాయుడి సేవలు అవసరమని ఆయన అన్నాడు. 

హైదరాబాద్ విజయ్ హజారే ట్రోఫీ జట్టు: అంబటి రాయుడు (కెప్టెన్), బి సందీప్ (వైఎస్ కెప్టెన్), అక్షత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, థాకూర్ వర్మ, రోహిత్ రాయుడు, సీవీ మిలింద్, మోహిద్ హసన్, సాకేత్ సాయి రామ్, మహ్మద్ సిరాజ్, మిక్కిల్ జైశ్వాల్, మల్లికార్జున్ (వికెట్ కీపర్), కార్తికేయ కాక్, టీ. రవితేజ, అయాదేవ్ గౌడ్

click me!