IPL2022: ఓపెనింగ్ మ్యాచ్ కు ముందే సెంచరీ కొట్టిన చెన్నై.. ముంబై తర్వాత వంద కోట్ల క్లబ్ లో చేరిక

Published : Mar 25, 2022, 02:27 PM IST
IPL2022: ఓపెనింగ్ మ్యాచ్ కు ముందే సెంచరీ కొట్టిన చెన్నై.. ముంబై తర్వాత వంద కోట్ల క్లబ్ లో చేరిక

సారాంశం

IPL 2022 Live Updates: ఐపీఎల్ సీజన్ ప్రారంభ మ్యాచుకు ఒక్కరోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కు గుడ్ న్యూస్.  స్పాన్సర్ల ద్వారా ఆ జట్టుకు వచ్చే ఆదాయం మూడంకెల సంఖ్యను దాటింది.  ఈ జాబితాలో ఇప్పటికే ముంబై ఇండియన్స్ ఉంది. 

శనివారం నుంచి ఐపీఎల్-2022 మెగా సీజన్ ప్రారంభం కానున్నది.  తొలి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై  సూపర్ కింగ్స్.. కోల్కతా నైట్ రైడర్స్ తో పోటీ పడనుంది. అయితే ఈ మ్యాచుకు ఒక్కరోజు ముందే రవీంద్ర జడేజా సారథ్యంలోని చెన్నై.. సెంచరీ క్లబ్ లో చేరింది. అదేంటి..? మ్యాచ్ కూడా ప్రారంభం కాకముందే సెంచరీ కొట్టడమేంటి..? అనుకుంటున్నారా.. సీఎస్కే  సెంచరీ చేసింది గ్రౌండ్ లో.. స్పాన్సర్షిప్ ల ద్వారా వచ్చే ఆదాయంలో ఆ జట్టు రూ. 100 కోట్ల మార్కును అందుకుంది. ఇలా చేరడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో  వంద కోట్ల రూపాయల మార్కు  (స్సాన్సర్ షిప్ లతో) ల క్లబ్ లో చేరిన రెండో జట్టుగా రికార్డులకెక్కింది.  

వివిధ స్పాన్సర్షిప్ ల  ద్వారా ఐపీఎల్ జట్లకు కోట్లాది రూపాయల ఆదాయం చేకూరుతున్న విషయం తెలిసిందే.   ఆటగాళ్ల జెర్సీలపై కనిపించే బ్రాండ్లతో పాటు ఒక జట్టుకు కొన్ని అధికారిక స్పాన్సర్లు కూడా ఉంటాయి. వీటి ద్వారా గడించే ఆదాయాన్ని స్పాన్సర్షిప్ల ద్వారా వచ్చే ఆదాయంగా పరిగణిస్తారు. అయితే ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరగా తాజాగా సీఎస్కే కూడా ఆ జాబితాలో చేరింది. 

 

ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. ఎస్ఎన్జీ గ్రూప్ తో మూడేండ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది.  ఈ ఒప్పందానికి భారీగా ఖర్చు చేసినట్టు సమాచారం. దీంతో  స్పాన్సర్ల ద్వారా చెన్నైకి వచ్చే ఆదాయం రూ. 100 కోట్లు దాటింది. సీఎస్కే ఇప్పటికే అముల్, అమెజాన్ పే, యూరో గ్రిప్ వంటి దిగ్గజ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 

 

సీఎస్కే స్పాన్సర్ల జాబితా : 

- టీవీఎస్ యూరో గ్రిప్ : మూడేండ్ల పాటు (వంద కోట్ల డీల్..  సీఎస్కే ఆటగాళ్లు ధరించే జెర్సీల మీద ఉండేది ఈ కంపెనీ లోగోనే..)
- ఇండియా సిమెంట్స్  (జెర్సీ పార్ట్నర్) 
- గల్ఫ్ ఆయిల్ - అసోసియేట్ పార్ట్నర్
- బ్రిటీష్ అంపైర్ -  అసోసియేట్ పార్ట్నర్
- ఎస్ఎన్జే 10000- అసోసియేట్ పార్ట్నర్
- రిలయన్స్ జియో - అసోసియేట్ పార్ట్నర్
- ఆస్ట్రల్ పైప్స్ - అసోసియేట్ పార్ట్నర్
- అముల్ - పౌరింగ్ పార్ట్నర్
- అమెజాన్ పే - డిజిటల్ పార్ట్నర్ 
- అక్విలిజ్ - అఫిషియల్  పార్ట్నర్
- డ్రీమ్ 11 - అఫిషియల్ పార్ట్నర్ 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే