ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్... ఇండిపెండెన్స్ డే మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్! వీడియో వైరల్...

By Chinthakindhi RamuFirst Published Aug 16, 2023, 3:42 PM IST
Highlights

గత ఏడాది డిసెంబర్‌లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్... స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో బ్యాటింగ్ చేసిన టీమిండియా యంగ్ వికెట్ కీపర్.. 

స్టార్ ప్లేయర్‌గా ఎదుగుతున్న సమయంలోనే కారు ప్రమాదానికి గురై, ఆటకు దూరమయ్యాడు టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. 2022 డిసెంబర్ 30న ఢిల్లీ సమీపంలో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్, డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేంత వేగంగా కోలుకుంటున్నాడు..

తన యాక్సిడెంట్ దగ్గర్నుంచి ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, అభిమానులకు తన ఫిట్‌నెస్ అప్‌డేట్స్ ఇస్తూ వస్తున్నాడు రిషబ్ పంత్. రెండు రోజుల క్రితం జాతీయ క్రికెట్ అకాడమీలో శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రిషబ్ పంత్..

పూర్తి ఫిట్‌నెస్ సాధించినప్పటికీ, రిషబ్ పంత్‌ని ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీల్లో ఆడించేందుకు ఆసక్తి చూపించడం లేదు టీమిండియా మేనేజ్‌మెంట్. వచ్చే ఏడాది ఐపీఎల్ 2024 సమయానికి లేదా ఆ తర్వాత రిషబ్ పంత్, మ్యాచ్‌కి కావాల్సిన పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని వార్తలు వస్తున్నాయి..

అయితే తాజాగా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని కర్ణాటకలోని విజయ్‌నగర్ జెఎస్‌డబ్ల్యూ దగ్గర ఓ మ్యాచ్‌లో రిషబ్ పంత్ బ్యాటింగ్ చేశాడు. రిషబ్ పంత్ బ్యాటింగ్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి.. 

back in the ground 😍😍 pic.twitter.com/M0r1tq9tzl

— Md Israque Ahamed (@IsraqueAhamed)

రిషబ్ పంత్‌ని చూసేందుకు భారీ సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చిన క్రికెట్ ఫ్యాన్స్, అతను ఆడే షాట్స్‌కి అరుస్తూ ఎంకరేజ్ చేశారు. మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన రిషబ్ పంత్, టీమిండియాకి త్రీ ఫార్మాట్ ప్లేయర్‌గా మారాడు..

టీ20ల్లో పెద్దగా ప్రదర్శన ఇవ్వలేకపోయినా వన్డేల్లో, టెస్టుల్లో మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌లు ఇస్తూ వచ్చిన రిషబ్ పంత్, సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌లో భారత జట్టు తరుపున ఒంటరి పోరాటం చేశాడు. డిసెంబర్ 2022లో రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో అతను లేకుండానే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ఆడింది టీమిండియా..

ఈ ప్రమాదం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్‌కి కూడా దూరమైన రిషబ్ పంత్, చేతి కర్రల సాయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడే మ్యాచులను చూడడానికి స్టేడియానికి వచ్చాడు. రిషబ్ పంత్ గైర్హజరీలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే డేవిడ్ వార్నర్‌కి మిగిలిన ప్లేయర్ల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో 14 మ్యాచుల్లో 5 విజయాలు మాత్రమే అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.. 

రిషబ్ పంత్ గైర్హజరీలో టెస్టుల్లో శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్‌లను వికెట్ కీపర్లుగా ప్రయత్నించింది భారత జట్టు. స్వదేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత వికెట్ కీపర్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్, విండీస్ టూర్‌లో రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు.

click me!