Pushpa Craze: ‘శ్రీవల్లి’ క్రేజ్ మాములుగా లేదుగా.. క్రికెటర్లందరిదీ అదే బా(పా)ట.. పాండ్యా, బ్రావో కూడా...

Published : Jan 26, 2022, 03:42 PM ISTUpdated : Jan 26, 2022, 03:45 PM IST
Pushpa Craze: ‘శ్రీవల్లి’ క్రేజ్ మాములుగా లేదుగా.. క్రికెటర్లందరిదీ అదే బా(పా)ట.. పాండ్యా, బ్రావో కూడా...

సారాంశం

Hardik Pandya And Dwayne Bravo Copied Allu Arjun: భారత క్రికెటర్లతో పాటు  విదేశీ ఆటగాళ్లు సైతం  ఈ సినిమాలోని డైలాగులు, పాటలు, డాన్సులకు ఫ్యాన్స్ అయిపోయారు. వికెట్ తీసినప్పుడు, క్యాచ్ పట్టినప్పుడు అల్లు అర్జున్ ను అనుకరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బ్రావో, పాండ్యా కూడా... 

తెలుగు సినిమా దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు  దేవి శ్రీ ప్రసాద్ లు కలిసి ఏ క్షణంలో పుష్ప  చిత్రంలోని పాటలను రికార్డు చేయించుకున్నారో గానీ.. ఇప్పట్లో అవి జనాల నోట్లోంచి వెళ్లేలా లేవు. పల్లెటూరు నుంచి పట్నం దాకా ఎవరి నోట విన్నా ఆ పాటలే. ఇక సోషల్ మీడియాలో ఈ సినిమా పాటలు, డైలాగులు, చూపే బంగారమాయేనే హుక్ స్టెప్ అయితే ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి. సినిమా జనాలను కాసేపు పక్కనబెడితే క్రికెటర్లకు కూడా ఈ సినామా పిచ్చిపిచ్చిగా నచ్చినట్టుంది. భారత క్రికెటర్లతో పాటు  విదేశీ ఆటగాళ్లు  సైతం  ఈ సినిమాలోని డైలాగులు, పాటలు, డాన్సులకు ఫ్యాన్స్ అయిపోయారు. వికెట్ తీసినప్పుడు, క్యాచ్ పట్టినప్పుడు అల్లు అర్జున్ ను అనుకరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఇప్పటికే రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సురేశ్ రైనాలు ఈ సినిమాలోని పాటలకు స్టెప్పులేశారు.  ఇక బన్నీ సినిమా పాటలంటేనే అనుకరించడంలో ముందుండే ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. ‘యే బిడ్దా’.. ‘తగ్గేదేలే’.. ‘చూపే బంగారమాయేనే’ పాటలకు కాలు కదిపాడు. వార్నర్ కూతుర్లు కూడా ‘సామి సామి’ పాటకు స్టెప్పులేశారు. ఇప్పుడు తాజాగా హార్ధిక్ పాండ్యా,  విండీస్ మాజీ క్రికెటర్  డ్వేన్ బ్రావో కూడా ఇదే బా(పా)టలో నడిచారు. 

 

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్) లో భాగంగా కొమిల్లా విక్టోరియన్స్ ,ఫార్చ్యూన్ బారిషల్ మధ్య జరిగిన మ్యాచులో బ్రావో.. శ్రీవల్లి స్టెప్ వేశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన బ్రావో బౌలింగ్‌లో మహిదుల్ ఇస్లాం భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించాడు. కానీ అది బౌండరీ వద్ద ఫీల్డ‌ర్ చేతిలో పడింది. వికెట్ తీసిన ఆనందంలో బ్రావో.. శ్రీవల్లి పాట‌కు స్టెప్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

 

బ్రావో నే గాక  టీమిండియా ఆల్ రౌండర్  హార్దిక్ పాండ్యా కూడా తన నాన్నమ్మతో కలిసి  శ్రీవల్లి పాటకు డాన్సు చేశాడు.  ఈ పాటకు డాన్సు చేయడమే గాక చివర్లో ఇద్దరూ కలిసి ‘తగ్గేదేలే’ అని ఫోజ్ కూడా ఇచ్చారు. 
 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?