సారీ రోహిత్.. నిన్ను అపార్థం చేసుకున్నాం.. నీ తప్పేం లేదు.. హిట్‌మ్యాన్‌కు విరాట్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Published : Feb 15, 2023, 03:36 PM ISTUpdated : Feb 15, 2023, 03:37 PM IST
సారీ రోహిత్.. నిన్ను అపార్థం చేసుకున్నాం.. నీ తప్పేం లేదు.. హిట్‌మ్యాన్‌కు విరాట్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

సారాంశం

Chetan Sharma Sting Operation: రోహిత్ శర్మ - విరాట్ కోహ్లీ ఫ్యాన్ వార్ నేటిది కాదు.  చాలాకాలంగా ఈ దిగ్గజాల అభిమానులు సోషల్ మీడియాలో  ‘నువ్వెంత అంటే నువ్వెంత’అన్న రేంజ్ లో వాదులాడుకుంటారు. కానీ చేతన్ పుణ్యమా అని వాళ్లిద్దరి అభిమానులు  కలిసిపోయారు. 

ఏడాది క్రితం  సోషల్ మీడియాలో   విరాట్ కోహ్లీ - రోహిత్ శర్మ  ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది.  కోహ్లీ కెప్టెన్సీ పోవడానికి రోహిత్ కూడా ఓ కారణమని.. బోర్డులో తనకు తెలిసినవారితో లాబీయింగ్ చేయడం వల్లే  కోహ్లీ కెప్టెన్సీ పోయిందని.. దాదాను అడ్డం పెట్టుకుని  రోహిత్   సారథ్య పగ్గాలు చేపట్టాడని  నానా రచ్చ. దీనికితోడు ఈ ఇద్దరి మధ్య ఎప్పట్నుంచో ఉన్న అభిప్రాయభేదాలు ఈ  అగ్గికి ఆజ్యం పోశాయి.   

కానీ  తాజాగా చేతన్ శర్మ  స్టింగ్ ఆపరేషన్ వల్ల అసలు నిజం బయటకు వచ్చింది.   కోహ్లీకి వెన్నుపోటు పొడవడంలో   రోహిత్ పాత్ర ఏమీ లేదని..  వాస్తవానికి అతడు అండగా నిలిచాడని  చేతన్ చెప్పడంతో విరాట్ ఫ్యాన్స్ హిట్‌మ్యాన్ ను క్షమాపణలు కోరుతున్నారు. 

చేతన్ శర్మ  తన వీడియోలో.. ‘భారత జట్టులో రెండు వర్గాలున్న మాట అందరికీ తెలిసిందే.  ఇందులో ఓ వర్గాన్ని రోహిత్ నడిపిస్తే మరోవర్గం కోహ్లీది.  అయితే రోహిత్ - కోహ్లీ ల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి.  వీళ్లిద్దరి మధ్య అహం పెద్ద సమస్యగా మారింది.  కానీ అది  అమితాబ్ బచ్చన్ - ధర్మేంద్ర మాదిరిగా ఉంటుంది. వాస్తవానికి  కోహ్లీ  సారథ్యం కోల్పోయాక చాలాకాలం పాటు పేలవ ఫామ్ లో ఉన్నాడు. ఆ టైమ్ లో అతడిని టీమ్ నుంచి తీసేయాలని వాదనలు కూడా వినిపించాయి.  కానీ  ఆ సమయంలో   రోహిత్ కోహ్లీకి అండగా నిలబడ్డాడు...’అని చెప్పాడు.  ఆసియా కప్ కంటే ముందు ఇంగ్లాండ్ తో టూర్ కు వెళ్లినప్పుడు  పాత్రికేయులు కోహ్లీ ఫామ్  గురించి  రోహిత్ ను  ప్రశ్నలు అడిగినప్పుడు  అతడు స్పందిస్తూ.. ‘ప్రతి క్రీడాకారుడి కెరీర్ లో ఇలాంటి ఫేజ్ ను దాటక తప్పదు.  కోహ్లీ  త్వరలోనే పుంజుకుంటాడు. అతడు జట్టుకు చేసిన  సేవల గురించి ప్రపంచానికి తెలుసు. మాకు కోహ్లీ ఫామ్  గురించి ఆందోళన లేదు. రెండు, మూడు ఇన్నింగ్స్ బాగా ఆడితే ఇక కోహ్లీని ఆపడం ఎవరితరమూ కాదు..’అని హిట్‌మ్యాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

చేతన్ ఈ విషయాలు బయటపెట్టడంతో  కోహ్లీ ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా స్పందించారు.  తాము రోహిత్ ను అపార్థం చేసుకున్నామని, తమను మన్నించాలని  హిట్ మ్యాన్ ను  కోరుతున్నారు. ఇకనుంచి  తాము  కోహ్లీతో పాటు రోహిత్ కు కూడా  మద్దతుగా నిలుస్తామని చెప్పుకొచ్చారు. 

 

పలువురు ట్వీట్ల ద్వారా.. ‘థ్యాంక్యూ రోహిత్. మేం నిన్ను అపార్థం చేసుకున్నాం.  వాస్తవానికి కోహ్లీకి బ్యాడ్ టైమ్ నడిచినప్పుడు నువ్వు మావాడికి అండగా నిలిచావ్. ఈ విషయంలో తప్పు చేసింది ఒకరైతే  మేము నిన్ను నిందించాం...’అని కామెంట్స్ చేస్తున్నారు.  ఈ ట్వీట్స్  కు రోహిత్ ఫ్యాన్స్ కూడా స్పందిస్తున్నారు.   ‘ఊరుకోండి బ్రో..  మీరు మేం వేరు కాదు. ఇకనుంచి మనం  కలిసికట్టుగా  కోహ్లీ, రోహిత్ లకు సపోర్ట్ చేద్దాం..’అని  రిప్లై ఇస్తున్నారు. 

 

 

 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !