గాంధీ నగర్ లో గల్లీ క్రికెట్ ఆడిన రషీద్ ఖాన్..!

Published : May 06, 2023, 11:00 AM IST
గాంధీ నగర్ లో  గల్లీ క్రికెట్ ఆడిన రషీద్ ఖాన్..!

సారాంశం

ఆయనను గుజరాత్ టైటాన్స్ జట్టు కొనుగోలు చేసింది.కాగా, శుక్రవారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ గెలుపుకు కీలక పాత్ర పోషించిది కూడా రషీద్ కావడం విశేషం.   


ఆప్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్  భారత్ లో గల్లీ క్రికెట్ ఆడాడు. గాంధీ నగర్ లో ఆయన భారత అభిమానులతో  కలిసి ఆయన సరదాగా క్రికెట్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో నెటిజన్లకు సైతం విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఐపీఎల్ 2023లో భాగంగా రషీద్ భారత్ కి వచ్చారు. ఆయనను గుజరాత్ టైటాన్స్ జట్టు కొనుగోలు చేసింది.కాగా, శుక్రవారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ గెలుపుకు కీలక పాత్ర పోషించిది కూడా రషీద్ కావడం విశేషం. 

కాగా, ఈ మ్యాచ్ కి ముందు రోజు రషీద్ గల్లీ క్రికెట్ ఆడాడు. మ్యాచుల్లో తన బౌలింగ్‌లో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే రషీద్ ఇక్కడ మాత్రం బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. కొంత మంది యువకులు గల్లీలో క్రికెట్ ఆడుతూ కన్పించగా.. అక్కడ ప్రత్యక్షమైన రషీద్ ఖాన్.. అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. బ్యాటింగ్ చేసి అందరినీ అలరించాడు. మరి రషీద్ ఖాన్ బ్యాటింగ్‌ను మీరూ చూసేయండి.

 

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను ముఫద్దల్ వోహ్రా అనే వినియోగదారు ట్విట్టర్‌లో షేర్ చేశారు. 26 సెకన్ల క్లిప్‌లో, రషీద్ ఖాన్ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో గల్లీ క్రికెట్ ఆడుతున్నట్లు చూడవచ్చు. అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ప్రజలు ఉత్సాహంగా వీడియోలు తీశారు.

‘‘భారత అభిమానులతో వీధి క్రికెట్ ఆడుతున్న రషీద్ ఖాన్’’ అంటూ వీడియోకి క్యాప్షన్ జత చేశారు. ఐపీఎల్ లో తమ ఫవరేట్ క్రికెటర్  ఇలా తమతో క్రికెట్ ఆడటంతో అక్కడి ప్రజలు ఆనందంతో పొంగిపోయారు. 
 

PREV
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన