
ఐపీఎల్ మెగా వేలం ఇటీవల జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే.. ఈ వేలంలో.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. సరైన ఆటగాళ్లను ఎంచుకోలేదనే విమర్శలు ఎక్కువగా వినిపించాయి. అయితే.. జట్టు ఎలా ఉన్నా... ఈ సారి ఐపీఎల్ లో తాము ఏ మాత్రం తగ్గకుండా సత్తా చాటాలని టీం భావిస్తోంది. ఈ క్రమంలో.. ముందుగానే వ్యూహ రచన మొదలుపెట్టింది.
జట్టు కూర్పు విషయంలో ఏ ఫ్రాంచైజీ కూడా ప్రకటన చేయకముందే ఎస్‌ఆర్‌హెచ్ తమ ఓపెనింగ్ జోడీ ఎవరనే విషయమై క్లారిటీ ఇచ్చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించాడు.
ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో పాటు యువ ఆటగాడు అభిషేక్ శర్మ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపాడు. గతంలో మిడిలార్డర్‌లో ఆడిన లెఫ్ట్ హ్యాండ్ ఆల్‌రౌండర్ అయిన అభిషేక్ శర్మకు ఈసారి ఓపెనర్‌గా ప్రమోషన్ ఇవ్వనున్నట్లు మురళీధరన్ పేర్కొన్నాడు. మెగా వేలంలో ఈ యువ ఆల్‌రౌండర్ కోసం ఎస్‌ఆర్‌హెచ్ ఏకంగా 6.5 కోట్లు వెచ్చించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అభిషేక్ శర్మ కోసం ఆరెంజ్ ఆర్మీ.. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌లతో పోటీ పడి భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.
ఐపీఎల్‌లో అభిషేక్ శర్మ ఇప్పటివరకు 22 మ్యాచ్‌ల్లో 17.2 సగటుతో 241 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన మెగా వేలంలో సన్‌రైజర్స్ మొత్తం 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అంతకుముందు రిటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లను కలుపుకుంటే ఎస్‌ఆర్‌హెచ్ సభ్యుల సంఖ్య 23కు చేరింది.
రిటైన్డ్ ఆటగాళ్లు:
కేన్ విలియమ్సన్(14 కోట్లు), కెప్టెన్
అబ్దుల్ సమద్(4 కోట్లు)
ఉమ్రాన్ మాలిక్(4 కోట్లు)
మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
నికోలస్ పూరన్(10.75 కోట్లు)
వాషింగ్టన్ సుందర్(8.75 కోట్లు)
రాహుల్ త్రిపాఠి(8.5 కోట్లు)
రొమారియో షెపర్డ్(7.7 కోట్లు)
అభిషేక్ శర్మ(6.5 కోట్లు)
భువనేశ్వర్ కుమార్(4.2 కోట్లు)
మార్కో జన్సెన్(4.2 కోట్లు)
టి నటరాజన్(4 కోట్లు)
కార్తీక్ త్యాగి(4 కోట్లు)
ఎయిడెన్ మార్క్రమ్(2.6 కోట్లు)
సీన్ అబాట్(2.4 కోట్లు)
గ్లెన్ ఫిలిప్(1.5 కోట్లు)
శ్రేయస్ గోపాల్(75 లక్షలు)
విష్ణు వినోద్(50 లక్షలు)
ఫజల్ హక్ ఫారుఖి(50 లక్షలు)
జె సుచిత్(20 లక్షలు)
ప్రియమ్ గార్గ్(20 లక్షలు)
ఆర్ సమర్థ్(20 లక్షలు)
శశాంక్ సింగ్(20 లక్షలు)
సౌరభ్ దూబే(20 లక్షలు)