
భారత మహిళా క్రికెట్ జట్టు సారథి మిథాలీరాజ్, క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. మహిళల క్రికెట్‌లోనే కాదు, పురుషుల క్రికెట్‌లోనూ ఎవ్వరికీ సాధ్యం కాని అత్యంత రేర్ ఫీట్ సాధించింది. న్యూజిలాండ్ పర్యటనలో భారత మహిళా జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడింది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో 3 వికెట్ల తేడాతో పోరాడి ఓడింది మిథాలీ సేన...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఓపెనర్ సబ్బినేని మేఘన 50 బంతుల్లో 7 ఫోర్లతో 49 పరుగులు చేసి అవుట్ కాగా యంగ్ సెన్సేషనల్ ఓపెనర్ షెఫాలీ వర్మ 38 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్‌తో 24 పరుగులు చేసింది...
యషికా భాటియా 38 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేయగా, హర్మన్ ప్రీత్ కౌర్ 18 బంతుల్లో 10 పరుగులు చేసింది. 135 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో రిచా ఘోష, కెప్టెన్ మిథాలీ రాజ్ కలిసి ఐదో వికెట్‌కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...
మిథాలీ రాజ్ 1999లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగ్రేటం చేయగా, ఆ తర్వాత నాలుగేళ్లకు 2003లో జన్మించింది రిచా ఘోష్. అంతర్జాతీయ ఆరంగ్రేటం తర్వాత జన్మించిన క్రికెటర్‌తో కలిసి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పిన మొట్టమొదటి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది మిథాలీ రాజ్.
అంతర్జాతీయ క్రికెట్‌లో 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న మొట్టమొదటి క్రికటెర్‌గా నిలిచిన మిథాలీ రాజ్, వన్డే క్రికెట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ప్లేయర్‌గా తన రికార్డును మరింత మెరుగు పర్చుకుంది...
వికెట్ కీపర్ రిఛా ఘోష్ 64 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 65 పరుగులు చేసి అవుట్ కాగా, పూజా వస్తాకర్ 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసింది. 81 బంతుల్లో 3 ఫోర్లతో 66 పరుగులు చేసిన మిథాలీ రాజ్ నాటౌట్‌గా నిలిచింది.
271 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన న్యూజిలాండ్ మహిళా జట్టు, 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ సోఫియా డివైన్ 30 బంతుల్లో 5 ఫోర్లతో 33 పరుగులు చేయగా సూజీ బేట్స్ 14 బంతుల్లో 4 ఫోర్లతో 16 పరుగులు చేసింది.. కెప్టెన్ అమీ సథెర్త్‌వైట్ డకౌట్ కాగా బ్రూకీ హల్లీడే 13 పరుగులు, వికెట్ కీపర్ కేటీ మార్టిన్ 20, హేలే జాన్సెన్ 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు...
అమిలియా కేర్ 135 బంతుల్లో 7 ఫోర్లతో 119 పరుగులు చేసి, అజేయ సెంచరీతో మ్యాచ్‌ను ముగించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4 వికెట్లు తీయగా, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, హర్మన్‌ప్రీత్ కౌర్ తలా ఓ వికెట్ తీశారు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మూడో వన్డే ఫిబ్రవరి 18న జరగనుంది.