పంత్ ని చూస్తే బాధగా ఉంది.. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

By telugu news teamFirst Published Jul 20, 2020, 2:57 PM IST
Highlights

సెలక్టర్లు పంత్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. గతంలో వరుసగా అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చిన సెలక్టర్లు.. ఉన్నపళంగా పంత్‌ ఊసే లేకుండా ఉన్నారు. 

టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్.. అతి చిన్నవయసులోనే జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ వారసుడిగా రంగ ప్రవేశం చేసిన పంత్.. ఆటలో వరస వైఫల్యాలతో ఆకట్టుకోలేకపోయాడు.  ప్రస్తుతం అవకాశాలు కోసం వేచి చూసే పరిస్థితి వచ్చింది. ధోనీ స్థానంలో వికెట్ కీపర్ గా పంత్ నిలదొక్కుకుంటాడని అందరూ భావించారు. అయితే.. ఆ స్థానాన్ని పంత్ కన్నా ఎక్కువగా కేఎల్ రాహుల్ భర్తీ చేశాడు.

దీంతో.. సెలక్టర్లు పంత్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. గతంలో వరుసగా అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చిన సెలక్టర్లు.. ఉన్నపళంగా పంత్‌ ఊసే లేకుండా ఉన్నారు. దీనికి కారణం పంత్‌ స్వీయ తప్పిదమే అంటున్నాడు మాజీ క్రికెటర్‌ కీర్తి ఆజాద్‌.  పంత్‌లో విపరీతమైన టాలెంట్‌ ఉన్నా గర్వంతోనే ప్రస్తుత పరిస్థితి తెచ్చుకున్నాడన్నాడు.

పంత్‌లో టాలెంట్‌కు కొదవలేదు. కానీ కాస్త టెంపరితనం తగ్గించాలి. హఠాత్తుగా తన బ్యాటింగ్‌ను మార్చుకుంటాడు. ప్రతీ బంతిని బౌండరీ దాటించాలనుకోవడం అతని చోటుకు చేటు చేసింది. వన్డే, టెస్టు ఫార్మాట్‌ను కూడా టీ 20 ఫార్మాట్‌లో ఆడాలంటే ఎలా. ఇది పంత్‌ మార్చుకోవాల్సి ఉంది. పంత్‌ను పక్కన కూర్చోబెట్టడంతో అతని టాలెంట్‌ వృథా అవుతుందనే చెప్పాలి. నువ్వు వికెట్‌ దగ్గర నిలబడటం నేర్చుకుంటే పరుగులు వాటంతటే అవే వస్తాయి. ముందు స్టైక్‌ రోటేట్‌ చేయడం అలవాటు చేసుకోవాలి. పంత్‌ కీపర్‌గా కంటే బ్యాట్స్‌మన్‌గాను మెరుగ్గా ఉన్నాడు. అయినా పూర్తి స్థాయి టాలెంట్‌ను బయటకు తీయలేకపోతున్నాడు. వచ్చిన అవకాశాల్లో అనవరసర తప్పిదాలు చేసి ఇప్పుడు చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. పంత్‌ మళ్లీ కచ్చితంగా అవకాశం ఇచ్చి చూడాలి. అతనికి ప్రత్యేకంగా ఒక స్థానాన్ని కూడా సెట్‌ చేస్తే మంచిది. పంత్‌ టాలెంట్‌ వేస్ట్‌ అవుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది’అని ఓ ఇంటర్వ్యూలో కీర్తి అజాద్ పేర్కొన్నారు. 

click me!