
ప్రేక్షకులకు అన్లిమిటెడ్ ఫన్ ను పంచుతున్న ఐపీఎల్ లో ఇప్పటికే చాలా ఫ్రాంచైజీలు ప్రత్యర్థి జట్లతో రెండేసి మ్యాచులు ఆడేశాయి. భారీ స్కోర్లతో పాటు లో స్కోరింగ్ గేముల్లో కూడా విజయం ఎవరిని వరిస్తుందో చెప్పని పరిస్థితి నెలకొంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగుతున్న ఐపీఎల్ ను చూడటానికి వచ్చిన పలువురు మాత్రం.. మ్యాచులతో తమకేమీ సంబంధం లేదని.. తామొచ్చింది వేరే పనికని వాళ్ల పని కానిచ్చేస్తున్నారు. ఎవరు చూస్తే మాకేంటి..? అనే సిద్ధాంతంతో.. గ్రౌండ్ లో అందరూ చూస్తుండగానే.. అదరాలను కలిపేసుకుంటున్నారు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ సీన్స్ కోసం చూసే కెమెరామెన్లకు కంటికి ఇవి ఇట్టే చిక్కుతాయి కదా...
గతంలో ప్రేమ పక్షులు చిన్నపాటి ఆనందాల కోసం జనం లేని సినిమాకో.. చెట్లు, పొదలు ఎక్కువగా ఉన్న పార్కుకో వెళ్లేవాళ్లు. కానీ కాలం మారింది. ఇప్పుడు ఏం చేసినా బహిరంగంగానే.. అదే అనుకున్నారు కాబోలు పై చిత్రంలో కనబడుతున్న జంట..
శనివారం పూణే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచులో అందరూ ఆసక్తిగా మ్యాచ్ చూస్తేంటే ఈ జంట మాత్రం.. అదరాలతో మాట్లాడుకున్నారు. తమ ముందు, పక్కన జనం ఉన్నారని కూడా మరిచిపోయి.. ‘ఈ లోకంతో మాకు పన్లేదు..’ అనుకుని కిస్ చేసుకున్నారు. మరి ఇలాంటి వింతలు, విశేషాల కోసమే వేచి చూసే మన ఐపీఎల్ కెమెరామెన్లు ఈ సీన్ కనబడ్డాక వదులుతారా..? జూమ్ లో ఈ కిస్సింగ్ సీన్ ను టీవీల ముందు చూస్తున్న అభిమానులకు ఫ్రీ షో వేశారు.
సరే.. మ్యాచ్ గోలలో పడి టీవీలలో చూడటం మరిచిపోయారే అనుకుందాం... మన సోషల్ మీడియా ట్రోలర్లు వదులుతారా..? అబ్బే.. ఆ అవకాశమే లేదుగా.. కెమెరామెన్లు తీసిన వీడియోల నుంచి స్క్రీన్ షాట్లను తీయడం.. అనంతరం వారి సామాజిక బాధ్యతగా.. సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడం.. అంతే. మిగిలిందంతా అందరికీ తెలిసిందేగా..
ఈ కిస్సింగ్ సీన్ కు సంబంధించిన పోటోలు సోషల్ మీడియాలో పెట్టగానే పలువురు మీమ్స్ తో విరుచుకుపడుతున్నారు. ఈ ఫోటోలో ప్రేమికులు కిస్ చేసుకుంటుండగా.. పక్కనే ఉన్న మరో యువతి... ‘నేనేదో మ్యాచ్ చూద్దామని వీస్తే వీళ్ల బరితెగింపు ఏంట్రా నాయనా..? రాకున్నా అయిపోయేది..’ అని అనుకుంటున్నట్టు ఫోజ్ పెట్టింది. ఇక కపుల్ కింద సీట్లో కూర్చున్న ఓ కుటుంబం మాత్రం ‘మాకేం సంబంధం లేదు. మేము మ్యాచ్ చూడటానికి వచ్చాం. చూస్తాం. వెళ్తాం.. మేమేం చూడలేదు. మాకేం తెలియదు..’ అన్నట్టుగా వ్యవహరించారు. ఏదేమైనా ఈ ప్రేమికుల విరహా వేదన ఇప్పుడు సోషల్ మీడియాకు ఒకరోజు మీమ్స్ చేయడానికి పండుగ అయింది.