IPL Live: 8 భాషలు.. 24 నెట్వర్క్ ఛానెల్స్.. 80 మంది కామెంటేటర్లు.. మెగా సీజన్ కు సిద్ధమైన స్టార్ నెట్వర్క్

Published : Mar 21, 2022, 06:11 PM ISTUpdated : Mar 21, 2022, 06:13 PM IST
IPL Live: 8 భాషలు.. 24 నెట్వర్క్ ఛానెల్స్.. 80 మంది కామెంటేటర్లు.. మెగా సీజన్ కు సిద్ధమైన స్టార్ నెట్వర్క్

సారాంశం

IPL Live Streaming: ఈనెల 26 నుంచి  మహారాష్ట్ర వేదికగా ఐపీఎల్ మెగా సీజన్ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో  క్యాష్ రిచ్ లీగ్ ను ఘనంగా ప్రసారం చేసేందుకు  బీసీసీఐ అధికారిక ప్రసారదారు స్టార్ నెట్వర్క్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.  తన ఆఖరి సీజన్ లో టీఆర్పీలను కొల్లగొట్టేందుకు గాను... 

మరో  ఐదు రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్-15 సీజన్ ను ప్రసారం చేయడానికి బీసీసీఐ అధికారిక ప్రసారదారు స్టార్ నెట్వర్క్ సిద్ధమైంది. ఐపీఎల్ పరిధి పెరిగిన నేపథ్యంలో ఈసారి ఈ మెగా సీజన్ ను ప్రసారం చేసే భాషలను కూడా పెంచింది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ లతో పాటు ఈసారి కొత్తగా మరాఠీ, మలయాళం, బెంగాలీ భాషల్లో కూడా  అక్కడి అభిమానులు ఐపీఎల్ ప్రసారాలను చూడొచ్చు.. వారి భాషల్లోనే లైవ్ కామెంట్రీని కూడా వినొచ్చు. ఈ మేరకు  డిస్నీ స్టార్ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ఏ ఏ భాషల్లో ఎవరు కామెంట్రీ చెప్పబోతున్నారో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. 

అంతకుముందు.. స్టార్ నెట్వర్క్ కు బీసీసీఐ తో కుదుర్చుకున్న ఒప్పందం త్వరలోనే ముగియనున్నది.  2022 ఐపీఎల్ సీజనే  డిస్నీ స్టార్ కు ఆఖరి పెద్ద ఈవెంట్. ఈ టోర్నీముగిసిన వెంటనే  కొత్త ప్రసారదారును బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది.  ఇప్పటికే బిడ్లను ఆహ్వానించిన బీసీసీఐ.. వాటి పేర్లను త్వరలో ప్రకటించనుంది. 

ఇక చివరి సీజన్ ను ఘనంగా ప్రసారం చేసేందుకు డిస్నీ స్టార్ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది.  8 భాషల్లో ప్రసారమయ్యే  ఐపీఎల్-15.. 24 నెట్వర్క్ ఛానెల్స్ ద్వారా అందిస్తున్నది స్టార్..  

ఐపీఎల్  కామెంటేటర్ల జాబితా.. 

ప్రపంచవ్యాప్తంగా  వివిధ భాషల్లో కామెంట్రీని అందించేందుకు స్టార్ నెట్వర్క్ సిద్ధమైంది.  వరల్డ్ ఫీడ్ టీమ్ కింద 16 మంది  వ్యాఖ్యతలు ఐపీఎల్ ప్రసారాలను నిరంతరం ప్రసారం చేయనున్నారు. అయితే ఈసారి అన్నింటికంటే ముఖ్యమైన విషయం  భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా.. అతడు ఈ సీజన్ లో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి హిందీ కామెంట్రీ చెప్పబోతున్నాడు. శాస్త్రి ఏడేండ్ల తర్వాత తిరిగి  వ్యాఖ్యతగా రాబోతున్నాడు. 

 

వరల్డ్ ఫీడ్ టీమ్ ఇదే : హర్ష భోగ్లే, సునీల్ గవాస్కర్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, మురళీ కార్తీక్, దీప్ దాస్ గుప్తా, అంజుమ్ చోప్రా, ఇయాన్ బిషప్,, అలన్ వికిన్స్, ఎంబాంగ్వ, నికోలస్ నైట్, డానీ మొరిసన్, సైమన్ డౌల్, మాథ్యూ హెడన్, కెవిన్ పీటర్సన్ 

డగౌట్ : అనంత్ త్యాగి, నెరొలి  మీడోస్, స్కాట్ స్టైరిస్, గ్రేమ్ స్వాన్ 

హిందీ కామెంటేటర్లు : ఆకాశ్ చోప్రా, ఇర్ఫాన్ పఠాన్, గౌతం గంభీర్, పార్థీవ్ పటేల్, నిఖిల్ చోప్రా, తన్య పురోహిత్, కిరణ్ మోరె, జతిన్ సప్రు, సురేన్ సుందరమ్, రవి శాస్త్రి, సురేశ్ రైనా 

 

తమిళ్ కామెంట్రీ టీమ్ : ముత్తు రామన్, ఆర్కే, భావన ఆర్జే బాలాజీ, ఎస్. బద్రీనాథ్, అభినవ్ ముకుంద్, ఎస్. రమేశ్, నానీ, కె. శ్రీకాంత్

కన్నడ : మధు, కిరణ్ శ్రీనివాస మూర్తి, విజయ్ భరద్వాజ్, భరత్ చిప్లి, జీకే అనిల్ కుమార్, వెంకటేశ్ ప్రసాద్, వేద కృష్ణమూర్తి, సుమేశ్ గోని, వినయ్ కుమార్ 

తెలుగు : ఎంఎఎస్ కృష్ణ, ఎన్, మచ్చ, వివి మేడపాటి, ఎంఎస్కే ప్రసాద్, ఎ. రెడ్డి, కెఎన్ చక్రవర్తి, ఎస్. ఆవులపల్లి, కళ్యాణ్ కృష్ణ, డీ. వేణుగోపాల్ రావ్, టీ.సుమన్ 

మరాఠీ : కునాల్ డేట్, ప్రశాంత్ సంత్, చైతన్య సంత్, స్నేహ్ ప్రధాన్, సందీప్ పాటిల్

బెంగాళీ : సర్దిందు ముఖర్జీ, గౌతమ్ భట్టాచార్య, జయ్దీప్ ముఖర్జీ, దేబశిష్ దత్త, 

మళయాళం: విష్ణు హరిహరన్, శియాస్ మహ్మద్, టిను యోహనన్, రైపి గొమేజ్, సీఎం దీపక్ 

8 భాషలతో పాటు డిస్నీ హాట్ స్టార్ (స్టార్ నెట్వర్క్ లో రాదు) లో గుజరాతీ కామెంట్రీ కూడా వినొచ్చు. ఇర్ఫాన్ పఠాన్, కిరణ్ మోరెతో పాటు మరికొందరు రేడియో జాకీలు గుజరాత్ టైటాన్స్ మ్యాచులు ఉన్నప్పుడు గుజరాతీలో కామెంట్రీ అందించనున్నారు.

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !